“బ్రేకప్ అయ్యి రెండేళ్లయినా ఆగని గొడవలు!”.. మాజీ ప్రియుడిని కత్తెరతో పొడిచిన యువతి.. 9 చోట్ల లోతైన గాయాలు.. అసలు నేపథ్యం ఇదే..!!

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌లో మాజీ ప్రేమికుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర కలకలం రేపింది. లలిత్‌పూర్ కాలనీలోని ఓ అద్దె గదిలో నివసిస్తున్న 40 ఏళ్ల ధర్మేంద్ర ప్రజాపతిపై అతడి మాజీ ప్రియురాలు ప్రీతి ప్రజాపతి కత్తెరతో దాడి చేసినట్లు ఫిర్యాదు నమోదైంది.

ఈ దాడిలో ధర్మేంద్ర శరీరంపై 8 నుంచి 9 చోట్ల లోతైన గాయాలైనట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు.

ఈ ఘటనపై ధర్మేంద్ర మాట్లాడుతూ.. తన మాజీ ప్రియురాలు ప్రీతి, ఆమె ప్రస్తుత ప్రియుడు సోనూ యాదవ్ ప్రోద్బలంతోనే తనపై దాడి చేసిందని ఆరోపించాడు. తనను హత్య చేయమని సోనూ ఆమెకు చెప్పాడని కూడా ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే, ప్రీతి తరఫున మరో వాదన వినిపిస్తోంది. తమ ప్రేమ బంధం ముగిసి సుమారు రెండేళ్లు గడిచినప్పటికీ, ధర్మేంద్ర తనను నిరంతరం వేధిస్తున్నాడని, వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను అడ్డుపెట్టుకుని బెదిరిస్తున్నాడని ఆమె తెలిపింది.

ఇరువైపులా పరస్పర ఆరోపణలు రావడంతో పోలీసులు ప్రీతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ ఘటనలో సోనూ యాదవ్ ప్రమేయం ఉందా? వ్యక్తిగత రికార్డులతో బెదిరించారనే ఫిర్యాదులో నిజమెంత? అనే కోణంలోనూ విచారణ జరుగుతోంది. అసలు ఈ దాడికి గల కారణమేంటి, ఘటన జరిగినప్పుడు ఏం జరిగిందనే విషయాలను నిగ్గుతేల్చేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *