జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్‌లో 40 ఏళ్ల పెంపుడు తల్లిపై (సవతి తల్లిపై) ఆమె పెంపుడు కొడుకు డీజిల్ పోసి నిప్పంటించిన దారుణ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటనలో ఉధంపూర్ హౌసింగ్ కాలనీకి చెందిన కేశవ్ వర్మ భార్య సుష్మా దేవి (40) తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు.
గత బుధవారం సాయంత్రం సుష్మా దేవి తన ఇంట్లో ఉండగా, ఆమె పెంపుడు కుమారుడు మోక్ష్ వర్మ ఆమెపై డీజిల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో సుమారు 70 శాతం కాలిన గాయాలతో ఆ మహిళ నొప్పితో కేకలు వేస్తూ, విలవిలలాడుతూ ఇంటి నుంచి బయటకు పరుగులు తీసిన హృదయ విదారక వీడియో దృశ్యాలు వెలుగులోకి వచ్చి ప్రజలను కలిచివేశాయి. ఆమె కేకలు విని పరుగెత్తుకొచ్చిన ఇరుగుపొరుగు వారు మంటలను ఆర్పి, ఆమెను ఉధంపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి సుష్మా దేవి మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఉధంపూర్ పోలీసులు, పరారీకి ప్రయత్నించిన మోక్ష్ వర్మను అరెస్టు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply