“కడుపులో కణితి అనుకుని వెళ్తే.. 5 గంటల్లో చేతిలో బిడ్డ..!” తాను గర్భవతినన్న విషయమే తెలియని 41 ఏళ్ల మహిళకు ఎదురైన వింత అనుభవం.. వైద్య ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ‘క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ’ వింత..!!

బ్రిటన్ దేశానికి చెందిన 41 ఏళ్ల సామీ ఇవాన్స్ (Sammy Evans) అనే మహిళ, తన కడుపులో ఏదో పెద్ద కణితి (గడ్డ) ఉందని భావించి చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లింది.

అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు.. కడుపులో ఎలాంటి కణితి లేదని, ఆమె నిండు గర్భిణి అని చెప్పி ఆశ్చర్యపరిచారు.

వైద్యులు ఈ విషయం చెప్పిన కేవలం ఐదు గంటల్లోనే ఆ మహిళకు అత్యంత ఆరోగ్యవంతమైన, అందమైన మగబిడ్డ జన్మించాడు.

తన వయసు నలభై దాటడంతో నెలసరి (మెనోపాజ్ దశ వల్ల) ఆగిపోయిందని భావించిన ఆ మహిళకు, గర్భం దాల్చినట్లుగా కనిపించే సాధారణ లక్షణాలేవీ తెలియలేదు.

వైద్య పరిభాషలో దీనిని “క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ” (Cryptic Pregnancy) అంటే ‘గుర్తించలేని / రహస్య గర్భం’ అని పిలుస్తారని, ఇది చాలా అరుదుగా జరిగే ఘటన అని వైద్యులు తెలిపారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *