“ఇక ఆ 75 ఏళ్ల తాత నాకొద్దు! పారిపోయిన నా భర్త ఇంటికి తిరిగొచ్చేశాడు.. అతడితోనే కలిసి జీవిస్తా”.. సోషల్ మీడియాలో దుమారం రేపిన రీనా ఆకస్మిక యూటర్న్.. పెళ్లి రద్దు..!

ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయా జిల్లాకు చెందిన 30 ఏళ్ల మహిళ రీనా, 75 ఏళ్ల వృద్ధుడు రామ్‌సుఖర్‌ల మధ్య జరిగిన వివాదాస్పద నిశ్చితార్థం వ్యవహారంలో ఓ కొత్త మలుపు చోటుచేసుకుంది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ వీడియోనే ఇప్పుడు ఈ వ్యవహారానికి ముగింపు కూడా పలికింది. కనిపించకుండా పోయిన తన భర్త తిరిగి ఇంటికి రావడంతో, 75 ఏళ్ల వృద్ధుడితో జరగాల్సిన వివాహాన్ని రద్దు చేసుకుంటున్నట్లు రీనా ఓ కొత్త వీడియో ద్వారా ప్రకటించింది.

దీనిపై రీనా విడుదల చేసిన తాజా ప్రకటన ప్రకారం.. తన భర్త అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో నిరాశ్రయురాలైన ఆమె, రామ్‌సుఖర్ కుమార్తె రాధను సంప్రదించి ఈ వివాహానికి అంగీకారం తెలిపింది. అయితే, సోషల్ మీడియాలో వైరల్ అయిన నిశ్చితార్థం వీడియోను చూసిన ఆమె భర్త వెంటనే ఇంటికి తిరిగి వచ్చాడు. భర్త రాకతో కుటుంబంలో కొంత అలజడి రేగినప్పటికీ, చట్టపరంగా తమకు విడాకులు కాలేదనే కారణంతోనూ, బంధువుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతోనూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేసింది.

ప్రస్తుతం పరిస్థితులు మారిపోవడంతో రామ్‌సుఖర్‌తో జరిగిన నిశ్చితార్థం పూర్తిగా రద్దయిందని చెప్పిన రీనా, ఇకపై తన భర్త, పాత కుటుంబంతోనే కలిసి జీవించబోతున్నట్లు తెలిపింది. అంతేకాకుండా, తన కుటుంబం మళ్లీ ఒక్కటైనందున రామ్‌సుఖర్ కుమార్తె రాధ ఇకపై తమ గురించి సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టవద్దని ఆమె చేతులు జోడించి విజ్ఞప్తి చేసింది. గత అక్టోబర్ 14న 45 ఏళ్ల వయసు తేడాతో ఇంటర్నెట్‌లో దావానలంలా వ్యాపించిన ఈ వ్యవహారం, తాజా మలుపుతో ముగింపుకు వచ్చింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *