ఛీ.. సిగ్గుగా లేదా..? 8 మంది పిల్లలను గాలికొదిలేసి ఇల్లు విడిచి పారిపోయిన వివాహేతర ప్రేమ జంట.. తినడానికి తిండి లేక, స్కూలుకు వెళ్లలేక అల్లాడుతున్న అమాయకపు పిల్లలు.. విలపిస్తున్న భార్యాభర్తలు..!

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీలో కర్వా చౌత్ పండుగకు కొన్ని రోజుల ముందు జరిగిన ఓ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.

ప్రేమలో పడి తమ కుటుంబాలను వదిలేసి పారిపోయిన జంట కారణంగా, 8 మంది చిన్నారులు రోడ్డున పడి అల్లాడుతున్న విషాద ఘటన వెలుగుచూసింది.

బారాబంకీ ప్రాంతానికి చెందిన అమిత్ గుప్తాకు వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. సేల్స్‌మ్యాన్‌గా పనిచేస్తున్న అమిత్ గుప్తాకు ఐదుగురు పిల్లల తల్లి అయిన నీలం అనే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. గత అక్టోబర్ 8న వీరిద్దరూ తమ ఇళ్లలోని డబ్బు, బంగారు ఆభరణాలతో అకస్మాత్తుగా కనిపించకుండా పోయారు.

తల్లిదండ్రులు చేసిన ఈ పని వల్ల ఒంటరిగా మిగిలిపోయిన 8 మంది పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. బడిలో చదువుకుంటున్న ఆ పిల్లల చదువు మధ్యలోనే ఆగిపోవడంతో పాటు, పాఠశాల నుంచి వారి పేర్లను తొలగించే పరిస్థితి ఏర్పడింది. తిండికి, ఆలనాపాలనాకు నోచుకోక అల్లాడుతున్న ఆ చిన్నారుల దుస్థితిని చూసి గ్రామస్థులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

దీనిపై బాధితురాలైన అమిత్ గుప్తా భార్య అనితా దేవి, నీలం భర్త పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న ఆ ఇద్దరి సెల్‌ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో, వారి ఆచూకీ కనిపెట్టడం కష్టంగా మారింది. సైబర్ సెల్, పోలీసులు ఈ ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *