బాల్కనీలోంచి గుట్కా ఉమ్మిన వృద్ధుడు.! “రెప్పపాటులో అదే పొజిషన్‌లో మరణం”.. వేలాడుతున్న మృతదేహాన్ని చూసి ఉలిక్కిపడ్డ జనం.. అసలేం జరిగింది.?

మధ్యప్రదేశ్ రాష్ట్రం విదిశ జిల్లాలోని గంజ్ బాసోదా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనంలో 60 ఏళ్ల వృద్ధుడు అద్దెకు ఉంటున్నాడు.

అతను అదే భవనంలో కూలీగా పనిచేస్తున్నాడు. అయితే, అక్కడ ఊహించని విధంగా ఒక ఘోర విద్యుత్ ప్రమాదం చోటుచేసుకుంది.

ఘటన జరిగిన రోజు ఆ వృద్ధుడు గుట్కా ఉమ్మివేయడానికి భవనం బాల్కనీలోకి వచ్చాడు. ఆ సమయంలో ఇంటికి అతి సమీపంలో పైనుంచి వెళ్తున్న 11 కేవీ (11 KV) హైటెన్షన్ విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తూ అతనికి తగిలాయి. తీవ్ర విద్యుదాఘాతానికి (కరెంట్ షాక్) గురైన అతను అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.

విద్యుదాఘాతం తీవ్రతకు ఆ వృద్ధుడి మృతదేహం బాల్కనీలోనే అలాగే వేలాడుతూ ఉండిపోయింది. ఇది చూసిన స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురై, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని కిందకు దించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిర్మాణంలో ఉన్న ఈ ఇంటికి అతి సమీపంలో 11 కేవీ విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వెళ్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదకరమైన ఈ విద్యుత్ లైన్‌ను వెంటనే వేరే చోటికి మార్చాలని లేదా తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని స్థానిక ప్రజలు విద్యుత్ బోర్డు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *