టీ20 క్రికెట్లో సిక్సర్లు వర్షం కురిపిస్తూ ప్రత్యర్థి బౌలర్లను భయపెడుతున్న యువ సంచలనం అభిషేక్ శర్మను ఒక విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌గా తీర్చిదిద్దిన భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్‌కు ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత వివేక్ రజ్దాన్ భావోద్వేగంతో కృతజ్ఞతలు తెలిపారు.
భారత యువ ఆటగాడు అభిషేక్ శర్మ ఆడుతున్న భయంకరమైన సిక్సర్ల గురించి లైవ్ కామెంటరీ సమయంలో వివేక్ రజ్దాన్ మాట్లాడుతూ, “నేను ముందుగా యువరాజ్ సింగ్‌కు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. అభిషేక్ శర్మను యువరాజ్ సింగ్ పూర్తిగా ఒక మృగంగా మార్చేశాడు. అతనికి అలా ఏం నేర్పించాడో తెలియదు… అంత సులభంగా సిక్సర్లు ఎలా కొడుతున్నాడో నాకే అర్థం కావడం లేదు! నా జీవితంలో ఇలాంటి ఆటను నేను ఎప్పుడూ చూడలేదు” అని ఆశ్చర్యపోయారు.
అభిషేక్ శర్మ విధ్వంసకర ఆట గురించి ఆయన ఇంకా మాట్లాడుతూ, “గురువు నేర్పించాడు, శిష్యుడు తన ఆటను చూపించడం మొదలుపెట్టాడు. అతను ఒక టీ20 అద్భుతం, ఒక టీ20 మేనియా! మైదానంలో బౌలర్లు మారుతూనే ఉన్నారు, కానీ అభిషేక్ శర్మ దూకుడు ఆలోచన మాత్రం ఏమాత్రం మారలేదు. ఇది నిజంగా ఒక పిచ్చి విధ్వంసం” అని ప్రశంసల జల్లు కురిపించారు.

Leave a Reply