ప్రసిద్ధ ‘కోపి లువాక్’ (Kopi Luwak) కాఫీ తయారీ విధానం గురించి చాలా మందికి తెలియని ఆశ్చర్యకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ఉదయాన్నే మనం తాగే కాఫీ పొడి, విచిత్రమైన రీతిలో ఒక జంతువు మలం (వ్యర్థాల) నుంచి తయారవుతుందనే విషయం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఈ విచిత్రమైన కాఫీ తయారీకి కారణమైన జంతువును ‘పామ్ సివెట్’ (తెలుగులో పునుగు పిల్లి) అని పిలుస్తారు. ఇది చూడటానికి పిల్లిలా ఉన్నప్పటికీ నిజమైన పిల్లి కాదు.
ఈ జంతువు బాగా పండిన కాఫీ పండ్లను ఇష్టంగా తింటుంది. పండులోని కండ భాగం దాని శరీరంలో జీర్ణమైనప్పటికీ, కాఫీ గింజలు మాత్రం జీర్ణం కాకుండా దాని మలంతో పాటు బయటకు వస్తాయి.
ఇలా జంతువు మలం నుంచి బయటకు వచ్చిన కాఫీ గింజలను సేకరించి, వాటిని పద్ధతి ప్రకారం శుభ్రం చేసి, ఎండలో బాగా ఆరబెడతారు. ఆ తర్వాత వాటి పైపొరను తొలగించి, గింజలను బాగా వేయించి పొడి చేసిన తర్వాతే ఈ ప్రపంచ ప్రసిద్ధి చెందిన కాఫీ పొడి తయారవుతుంది.
ఇండోనేషియాకు చెందిన ఈ కాఫీ, సివెట్ (పునుగు పిల్లి) జీర్ణవ్యవస్థలోని ప్రత్యేకమైన ఎంజైమ్‌ల కారణంగా పూర్తిగా భిన్నమైన రుచిని కలిగి ఉంటుంది. దీని విచిత్రమైన తయారీ విధానం మరియు ప్రత్యేకమైన రుచి కారణంగా ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

Leave a Reply