“నాన్నా.. అమ్మా..” – తల్లిదండ్రుల మృతదేహాలను చూసి రోదించిన 6 ఏళ్ల చిన్నారి! ఆస్తి వివాదంలో ఐదుగురిని కాల్చి చంపిన దారుణం.!!

ఆస్తి వివాదం కారణంగా ఓ హోటల్‌లో తండ్రి, తల్లి, నానమ్మ, బాబాయ్.. ఇలా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని సొంత బంధువే కాల్చి చంపిన ఘటనలో, తల్లిదండ్రుల మృతదేహాలను చూసి 6 ఏళ్ల చిన్నారి గుండెలు పగిలేలా రోదించిన దృశ్యం అందరినీ కలచివేసింది.

అసోం రాష్ట్రం గువాహటిలోని లచిత్ నగర్‌లో ఉన్న ‘హోటల్ బిలాస్ ఇన్’ ప్రాంగణంలో సోమవారం రాత్రి ఈ భయానక కాల్పుల ఘటన చోటుచేసుకుంది. కుటుంబ ఆస్తికి సంబంధించిన దీర్ఘకాలిక వివాదం కారణంగా, కనకాంత గొగోయ్ అనే వ్యక్తి తన సొంత బంధువులైన దేబర్షి, అతని భార్య రీనికా, దేబర్షి తల్లి, సోదరుడితో సహా ఐదుగురిని తుపాకీతో దారుణంగా కాల్చి చంపాడు. ఈ దాడిలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘోరమైన ఘటన అనంతరం గువాహటి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, దాడికి ఉపయోగించిన తుపాకీని స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితుడు కనకాంత గొగోయ్‌ను అరెస్టు చేశారు.

కాగా, హత్యకు గురైన దేబర్షి – రీనికా దంపతుల మృతదేహాలను తీసుకువచ్చినప్పుడు, వారి 6 ఏళ్ల కుమార్తె, ఏడాదిన్నర (1.5 ఏళ్ల) వయసున్న కుమారుడు తమ తల్లిదండ్రుల మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించిన దృశ్యం చూసిన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. కేవలం ఆస్తి ఆశతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి ప్రాణాలను బలిగొనడంతో, ఏ పాపం ఎరుగని ఈ ఇద్దరు పసిపిల్లలు ఇప్పుడు అనాథలుగా మారిన తీరు ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *