కొత్త పెళ్లాన్ని మురిపెంగా జూకు తీసుకెళ్లిన భర్త.! “బైక్ పార్కింగ్ గ్యాప్‌లో వేరొకడితో జూట్”.. 20 రోజుల తర్వాత దొరికిన 18 ఏళ్ల యువతి.. దారి తప్పిపోయిందా.. దిగ్భ్రాంతికరమైన కారణం..!

మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌లోని జూలాజికల్ పార్క్‌కు (జూకు) భర్తతో కలిసి వచ్చిన 18 ఏళ్ల వివాహిత, అకస్మాత్తుగా అదృశ్యమై 20 రోజుల తర్వాత పోలీసుల ద్వారా సురక్షితంగా రక్షించబడింది.

శివపురి జిల్లాకు చెందిన ఈ దంపతులు బంధువులను కలిసేందుకు గ్వాలియర్ రాగా, భార్య కోరిక మేరకు జూను సందర్శించేందుకు వచ్చారు. భర్త తన ద్విచక్ర వాహనాన్ని పార్కింగ్ స్థలంలో పార్క్ చేయడానికి వెళ్లిన సమయంలో, ఆ యువతి అక్కడి నుంచి అకస్మాత్తుగా అదృశ్యమైంది.

భర్త తిరిగి వచ్చి చూడగా భార్య కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. జూ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, ఆ యువతి అర్మాన్ ఖాన్ అనే వ్యక్తి బైక్ వెనుక కూర్చుని వెళుతున్నట్లు గుర్తించారు. ఆ వ్యక్తితో తన భార్యకు సంబంధం ఉందని భర్త ఆరోపించగా, కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మరంగా గాలించి 20 రోజుల తర్వాత ఆ యువతిని పట్టుకుని విచారిస్తున్నారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో.. తాను దారి మర్చిపోయానని, అందుకే ఆ వ్యక్తిని సహాయం అడిగి బైక్‌పై వెళ్లానని ఆ యువతి తెలిపింది. అయితే, సీసీటీవీ ఫుటేజీలో ఉన్న వ్యక్తి నేపథ్యం గురించి, ఆమె అదృశ్యం వెనుక ఉన్న అసలు నిజానిజాలపై పోలీసులు మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.

దీనిపై చీఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాబిన్ జైన్ మాట్లాడుతూ.. “దొరికిన యువతికి 18 ఏళ్లు నిండిన మేజర్ కావడంతో, ఆమె తన సొంత ఇష్టపూర్వకంగా ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉంది. ఆమెను ఎవరైనా బలవంతంగా కిడ్నాప్ చేస్తే తప్ప చట్టపరంగా ఎలాంటి చర్యలూ తీసుకోలేము. ప్రస్తుతం ఆ యువతి వాంగ్మూలాన్ని కోర్టులో నమోదు చేయనున్నాం. దాని ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని స్పష్టం చేశారు.


Posted

in

by

Tags: