“వివాహేతర సంబంధంతో పుట్టిన బిడ్డను టాయిలెట్ బౌల్‌లో తల నొక్కి చంపిన కిరాతకం.!” ఆసుపత్రిలో జరిగిన దిగ్భ్రాంతికరమైన హత్య కేసు.. పోస్టుమార్టంలో వెలుగులోకి వచ్చిన సంచలన నిజం..!!

చెన్నైలోని ఎన్నూర్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువతి నిండు గర్భిణిగా తిరువొత్తియూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లింది.

అక్కడ మూత్రవిసర్జనకని మరుగుదొడ్డికి వెళ్లిన ఆ యువతికి అకస్మాత్తుగా నొప్పులు వచ్చి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

పెళ్లి కాకుండానే బిడ్డ పుడితే సమాజంలో తనకు అవమానం జరుగుతుందని భయపడిన ఆ యువతి, అత్యంత క్రూరమైన నిర్ణయం తీసుకుని చిన్నారి ముఖాన్ని తన చేతులతో గట్టిగా అదిమిపెట్టి దారుణంగా హత్య చేసింది.

అనంతరం బిడ్డ పుడుతూనే చనిపోయిందని నాటకమాడిన ఆ యువతి కుట్ర, మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టం నివేదికలో అసలు నిజం బయటపడటంతో బట్టబయలైంది.

ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ యువతిని అరెస్టు చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తుండటంతో పాటు, దీనికి కారణమైన ఆమె ప్రియుడి కోసం, ఆసుపత్రి వర్గాల పాత్రపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags: