రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ మెడికల్ షాపులో నెలకు కేవలం 10 వేల రూపాయల జీతానికి పనిచేస్తున్న ఒక సామాన్య యువకుడి బ్యాంకు ఖాతాలో ఏకంగా లక్ష కోట్ల రూపాయల వరకు లీన్ (Lien – ఖాతా ఫ్రీజ్) విధించిన విచిత్ర ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
రాజస్థాన్‌కు చెందిన 22 ఏళ్ల సమీర్ ఖాన్ అనే ఆ యువకుడు, తన మొబైల్లో రీఛార్జ్ చేసుకునేందుకు కోటక్ బ్యాంక్ యాప్‌ను తెరిచి చూడగా, తన ఖాతాలో ఉన్న 55 వేల రూపాయలు అకస్మాత్తుగా మాయమై బ్యాలెన్స్ జీరో (సున్నా) చూపించడంతో తీవ్ర షాక్‌కు గురయ్యాడు.
ఖాతాను నిశితంగా పరిశీలించగా, అందులో ఒక భారీ మొత్తం ఫ్రీజ్ చేయబడి ఉన్నట్లు (లీన్) కనిపించడంతో ఏం చేయాలో పాలుపోని అతడు, వెంటనే ఈ విషయాన్ని తన దుకాణం యజమాని, తోటి ఉద్యోగులకు తెలియజేశాడు.
వెంటనే వారంతా కలిసి సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే, ఈ వ్యవహారంపై నేరుగా బ్యాంకు అధికారులనే కలిసి మాట్లాడాలని పోలీసు అధికారులు వారికి సూచించారు.
సాధారణ జీతంతో పనిచేసే ఇలాంటి పేద యువకుడి బ్యాంకు ఖాతాలో కోట్ల కొద్దీ రూపాయల లీన్ మొత్తం చూపించడం బ్యాంకింగ్ వ్యవస్థలోని ఏదైనా సాంకేతిక లోపం వల్ల జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
