పాఠశాల తరగతి గదిలో ఆరేళ్ల బాలికపై ఎనిమిదేళ్ల బాలుడి దాడి.. తీవ్రంగా గాయపడిన చిన్నారి!

హర్యానాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. కేవలం ఎనిమిదేళ్ల బాలుడు.. ఆరేళ్ల బాలికపై తరగతి గదిలోనే దాడి చేయడంతో చిన్నారి తీవ్రంగా గాయపడింది.

చండీగఢ్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న ఈ ఇద్దరు పిల్లల మధ్య ఏదో విషయంలో గొడవ జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో బాలుడు బాలికపై తీవ్రంగా దాడి చేసినట్లు కథనం పేర్కొంది. ఈ ఘటనలో చిన్నారికి తీవ్ర గాయాలై రక్తస్రావం కావడంతో ఆమె కేకలు వేసింది.

బాలిక కేకలు విన్న ఉపాధ్యాయులు వెంటనే తరగతి గదికి చేరుకుని, గాయపడిన చిన్నారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పాఠశాలకు చేరుకుని కేసు నమోదు చేసినట్లు కథనం పేర్కొంది. ఎనిమిదేళ్ల బాలుడిని కూడా విచారిస్తున్నట్లు తెలిపింది.

ఇదిలా ఉండగా, తరగతి గదిలో బాలుడు బాలికపై దాడి చేస్తున్న దృశ్యాలు వీడియో రూపంలో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనతో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు కథనం .


Posted

in

by

Tags: