“అయ్యో ఒళ్లంతా వణుకుతోంది..! క్షణాల్లో ఛిన్నాభిన్నంగా పేలిపోయిన కొరియర్ పార్శిల్”. బండిలో నుంచి తీస్తుండగా జరిగిన ఘోరం. భయాందోళనకు గురిచేస్తున్న వీడియో.!!!

మహారాష్ట్రలోని లాతూర్ నగరంలో ఉన్న విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ మార్గ్‌లో శనివారం నాడు ఒక టెంపో వాహనం నుంచి కొరియర్ పార్శిళ్లను దించుతుండగా, ఊహించని విధంగా ఒక పార్శిల్ భారీ శబ్దంతో పేలిపోయింది.

ఈ ప్రమాదంలో పార్శిల్‌ను దించేందుకు ప్రయత్నించిన ఓ ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ పేలుడు శబ్దం విని ఆ ప్రాంతంలోని ప్రజలు భయాందోళనలకు గురై నలుదిక్కులా పరుగులు తీశారు.

ఈ ఆకస్మిక పేలుడుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో విడుదలై తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఆ వీడియోలో.. టెంపో నుంచి ఉద్యోగి పార్శిల్‌ను బయటకు తీసిన మరుక్షణమే భారీ పేలుడు సంభవించినట్లు స్పష్టంగా రికార్డ్ అయింది. తీవ్రంగా గాయపడిన ఉద్యోగిని రక్షించిన స్థానికులు, వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న లాతూర్ నగర పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ (బాంబు నిర్వీర్యక బృందం) మరియు ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు ప్రారంభించారు. ఆ పార్శిల్‌లో పేలుడు పదార్థాలు ఉన్నాయా? లేక మరేదైనా రసాయనాలు పేలిపోయాయా? అనే దానిపై పలు కోణాల్లో తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.

పేలుడుకు గల అసలు కారణం ఇంకా కనుక్కోనప్పటికీ, పోలీసులు సీసీటీవీ దృశ్యాలను ఆధారంగా చేసుకుని తదుపరి విచారణ జరుపుతున్నారు. ఈ దారుణ ఘటన లాతూర్ నగరంలో తీవ్ర కలకలం, భయాందోళనలు రేకెత్తించింది.


Posted

in

by

Tags: