సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంటర్వ్యూలో కోడింగ్ టెస్ట్ రాసేందుకు చాట్‌జీపీటీ (ChatGPT), క్లాడ్ (Claude) లేదా కర్సర్ (Cursor) లాంటి ఏఐ (AI) టూల్స్ ఉపయోగించడానికి అనుమతి అడిగిన ఓ అభ్యర్థి, ఏకంగా ఆ ఉద్యోగాన్నే కోల్పోయిన ఘటన ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.
ప్రస్తుతం రియల్ టైమ్ ప్రాజెక్టుల్లో ఎవరూ ఏఐ లేకుండా కోడింగ్ రాయడం లేదని, ఏఐ టూల్స్ 30 సెకన్లలో ఇచ్చే పరిష్కారం కోసం తాను 45 నిమిషాల సమయం ఎందుకు వృథా చేయాలని ఆ అభ్యర్థి ఇంటర్వ్యూవర్ను ప్రశ్నించాడు.
అయితే, ఏఐ రాసిన కోడ్‌కు సంబంధించిన ‘టైమ్ కాంప్లెక్సిటీ’ (Time Complexity) గురించి వివరించాలని ఇంటర్వ్యూవర్ అడిగినప్పుడు.. ‘ఆ విషయాన్ని కూడా నేను చాట్‌జీపీటీనే అడిగి చెప్పనా?’ అని అతను ఎదురుప్రశ్న వేయడం ఆ కంపెనీకి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
దీంతో, ప్రాథమికంగా సమస్యలను పరిష్కరించే నైపుణ్యాన్ని (Problem Solving Skills) పెంచుకోవాలని సూచిస్తూ ఆ కంపెనీకి చెందిన టాలెంట్ అక్విజిషన్ బృందం అతడి అభ్యర్థిత్వాన్ని రిజెక్ట్ చేస్తూ ఈ-మెయిల్ పంపింది.
ఈ ఘటనకు సంబంధించిన పోస్ట్ ‘ఎక్స్’ (X) ప్లాట్‌ఫారమ్‌లో వైరల్ కావడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. పనులు వేగవంతం చేసుకోవడానికి ఏఐ వాడకం సహాయపడొచ్చు కానీ, సొంతంగా ఆలోచించి పరిష్కారాలు చూపే ఇంజనీర్లనే కంపెనీలు కోరుకుంటాయని పలువురు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

Leave a Reply