“కర్వా చౌత్ వ్రతం ముగిశాక ఇంతటి విషాదమా?” భార్య మృతి చెందిన షాక్‌లో భర్త తీసుకున్న దారుణ నిర్ణయం! ఒకే రోజు రెండు ప్రాణాలు బలి. తీవ్ర విషాదంలో కుటుంబం.!

మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లో, కర్వా చౌత్ వ్రతం ఆచరించిన కొద్ది గంటల్లోనే భార్యాభర్తలిద్దరూ మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

భోపాల్‌లోని ఖజూరీ సడక్ బర్ఖేడా బోందర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భర్తకు వేరొక మహిళతో సంబంధం ఉందనే అనుమానం భార్యకు ఉండేదని, దీనివల్ల ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగేవని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది.

ఘటన జరిగిన రోజు కర్వా చౌత్ వ్రతం సందర్భంగా భార్యాభర్తలిద్దరూ కలిసి పూజ చేశారు. ఆ తర్వాత, తన స్నేహితుడిని కలిసి వస్తానని చెప్పి భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అతడు వెళ్లిన కొద్దిసేపటికే భార్య ఇంట్లో విగతజీవిగా కనిపించినట్లు చెబుతున్నారు. బయటకు వెళ్లి తిరిగి వచ్చిన భర్త, భార్య విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యాడు.

భార్య మరణంతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త.. ఇంటి నుంచి సుమారు 200 మీటర్ల దూరంలో ఉన్న ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. వెంటవెంటనే భార్యాభర్తలిద్దరూ మృతి చెందిన వార్త గ్రామం అంతటా వ్యాపించడంతో స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పండుగ రోజున సంతోషంగా ఉండాల్సిన కుటుంబంలో ఇలాంటి ఘోరం జరగడం బంధువులను సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. భర్తకు వేరొక మహిళతో సంబంధం ఉందన్న భార్య అనుమానమే ఈ ఘటనకు ప్రధాన కారణమై ఉండొచ్చని ప్రాథమిక విచారణలో భావిస్తున్నారు. అయితే, భార్యాభర్తలిద్దరి మృతికి గల పూర్తి కారణాలు ఇంకా నిర్ధారించబడలేదు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, కుటుంబ నేపథ్యంతో సహా అన్ని కోణాల్లో లోతుగా విచారిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *