“ఇప్పుడు ఇవి కూడా దొంగతనాలకు దిగాయా?”.. బీర్ బాటిళ్లను కూడా వదలని ఎలుగుబంట్లు. తరిమికొట్టేందుకు యత్నించిన దంపతులకే వార్నింగ్.. వైరలవుతున్న వీడియో..!!!

అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రం గాట్లిన్‌బర్గ్ ప్రాంతంలో, మూడు ఎలుగుబంట్లు కలిసి ఓ దంపతుల ట్రక్కులోని ఆహార పదార్థాలను దొంగిలించిన ఘటన నెట్టింట వైరల్‌గా మారింది.

ఇంటి ముందు నిలిపి ఉంచిన ట్రక్కు తలుపులు తెరిచిన ఎలుగుబంట్లు, అందులో ఉన్న గ్రానోలా బార్స్, స్నాక్స్ (తినుబండారాలు), బీర్ బాటిళ్లను బయటకు తీసి నానా హంగామా చేశాయి. ముఖ్యంగా బీర్ బాటిళ్లను బయటకు తీసే క్రమంలో అవి కింద పడి పగిలిపోయినట్లు సమాచారం.

ఈ ఘటనను ఇంట్లో ఉన్న ఓ మహిళ వీడియో తీసింది. ఆ వీడియోలో మూడు ఎలుగుబంట్లు ట్రక్కులోకి దూరి ఆహార పదార్థాలను తీసుకెళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది. ట్రక్కులోని వస్తువులను కిందకు దించడానికి కూడా తమకు సమయం దొరకలేదని పామ్ కాన్లీ అనే మహిళ తెలిపారు. ఎలుగుబంట్లు గ్రానోలా బార్స్, బీర్ మరియు ‘క్రంచ్ ఎన్ మంచ్’ వంటి స్నాక్స్ తిన్నాయని ఆమె చెప్పారు.

ఇదిలా ఉండగా, ఎలుగుబంట్లను తరిమికొట్టేందుకు దంపతులు ప్రయత్నించగా, అవి భయపడి పారిపోకుండా వారిని తమ దరిదాపుల్లోకి రావొద్దన్నట్లుగా హెచ్చరించాయి. నల్ల ఎలుగుబంట్లు సర్వభక్షకాలు (omnivore) కావడంతో, ఆహారం వాసనను కిలోమీటర్ల దూరం నుంచే పసిగట్టగల సామర్థ్యం కలిగి ఉంటాయి. ఆహారం కోసం జనవాసాల్లోకి వచ్చే ఇటువంటి ఎలుగుబంట్లు, ఒక్కోసారి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా చక్కర్లు కొడుతోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *