“సినిమా చూసి చేసిన పక్కా చోరీ..!” ఆహారంలో నిద్రమాత్రలు ఇచ్చి రూ.2 కోట్ల ఆభరణాల దోపిడీ.. వృద్ధురాలిని మత్తులోకి దించి ఎత్తుకెళ్లిన దొంగలు.. చాకచక్యంగా సొత్తును రికవరీ చేసిన పోలీసులు..!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్‌లో సినిమా ఫక్కీలో ఇంట్లో పనిచేసే పనిమనిషి, వంటమనిషి ఇద్దరూ కలిసి ఓ వృద్ధురాలికి మత్తుమందు ఇచ్చి ₹2 కోట్ల విలువైన నగలు, పురాతన నాణేలను దోచుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది.

మీరట్‌లోని డిఫెన్స్ కాలనీకి చెందిన క్రీడా సామగ్రి వ్యాపారి అశుతోష్ భల్లా ఇంట్లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన రోష్ని ఒరాన్ అనే మహిళ, జితేంద్ర కుమార్ అనే వంటమనిషి పనిచేస్తున్నారు.

ఇంటి గుట్టుమట్లు అన్నీ తెలిసిన వీరిద్దరూ కలిసి వేసిన పథకం ప్రకారం, వ్యాపారి వృద్ధ తల్లికి ఆహారంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి ఆమెను పూర్తిగా అపస్మారక స్థితిలోకి (మత్తులోకి) పంపారు.

ఆ తర్వాత ఇంట్లో ఉన్న విలువైన బంగారం, వెండి ఆభరణాలు, పాత విదేశీ నాణేలు, నగదును ఒక సంచిలో నింపి రోష్ని ద్వారా ఇంటి బయటకు తరలించారు.

ఈ ఘటనపై పోలీసులు వేగంగా స్పందించి పనిమనిషి రోష్ని, వంటమనిషి జితేంద్ర కుమార్‌తో సహా నలుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి ₹2 కోట్ల విలువైన దోపిడీ సొత్తును పూర్తిగా రికవరీ చేశారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *