“డబ్బులు పోయాయి.. మనశ్శాంతి కరువైంది..!” వెజ్ బిర్యానీలో చికెన్ ముక్కలా..? విమాన ప్రయాణికుడి షాకింగ్ పోస్ట్.. బెంగళూరు విమానాశ్రయంలో తీవ్ర కలకలం.. వైరల్ వీడియో..!!

బెంగళూరు విమానాశ్రయంలోని ఓ రెస్టారెంట్‌లో, పూర్తిగా శాఖాహారులైన ఒక కుటుంబానికి ‘వెజ్ బిర్యానీ’లో మాంసం ముక్కలు వడ్డించిన ఘటన సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది.

ఎక్స్ (X) వేదికగా @PiyushpaviA అనే యూజర్ పంచుకున్న సమాచారం ప్రకారం.. బెంగళూరు విమానాశ్రయం టెర్మినల్ 1 సమీపంలోని ‘టేస్ట్ ఆఫ్ ఇండియా’ రెస్టారెంట్‌లో అతడు తన కుటుంబంతో కలిసి వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాడు.

అయితే, బిల్లులో వెజ్ బిర్యానీ అని స్పష్టంగా ఉన్నప్పటికీ, వారు తింటున్న బిర్యానీలో నాలుగు చికెన్ ముక్కలు ఉండటాన్ని చూసి ఆ కుటుంబం ఒక్కసారిగా షాక్‌కు గురైంది.

తాము కనీసం గుడ్డును కూడా ముట్టుకోని పక్కా శాఖాహారులమని, తెలియక ఆ బిర్యానీని తినడంతో తమ కుటుంబం తీవ్ర మనోవేదనకు, కలవరానికి గురైందని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.

దీనిపై రెస్టారెంట్ మేనేజర్‌ను నిలదీయగా.. వారు తమ తప్పును అంగీకరించినప్పటికీ, డబ్బులు మాత్రం వాపసు ఇవ్వలేమని తేల్చి చెప్పారని బాధిత ప్రయాణికుడు తెలిపాడు. ఈ ఘటనపై సంబంధిత రెస్టారెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని విమానాశ్రయ అధికారులను అతడు కోరాడు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *