“రూ. 200కే 1 కిలో అల్యూమినియం ఫాయిల్ కొన్న మహిళకు ఎదురైన షాక్.! పెట్టె తెరిచి చూస్తే లోపల ఉన్నది ఫాయిలా.. సిమెంటా.?”

ఢిల్లీలోని సదర్ బజార్ (Sadar Bazar) తక్కువ ధరకు హోల్‌సేల్ వస్తువులు దొరికే మార్కెట్‌గా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వస్తువులు కొనుగోలు చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు.

అలా వెళ్లిన ఢిల్లీకి చెందిన రేఖా బిష్త్ (Rekha Bisht) అనే మహిళ, ఒక కిలో అల్యూమినియం ఫాయిల్ కేవలం రూ. 200లకే దొరకడంతో ఎంతో సంతోషంగా కొనుగోలు చేసింది. కానీ, ఇంటికి వెళ్లి ఆ పెట్టె తెరిచి చూసిన ఆమెకు ఊహించని షాక్ ఎదురైంది.

రేఖ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వారా పంచుకుంది. దగ్గర్లోని దుకాణాల్లో ఇదే అల్యూమినియం ఫాయిల్ సుమారు రూ. 700లకు విక్రయిస్తుండగా, సదర్ బజార్‌లో కేవలం రూ. 200 అడగడంతో వెంటనే కొనేశానని ఆమె తెలిపింది. తక్కువ ధరకే ఎక్కువ వస్తువు దొరికిందని మురిసిపోయిన ఆమెకు, ఇంట్లో పెట్టె తెరిచిన తర్వాతే అసలు అనుమానం వచ్చింది.

ఫాయిల్ రోల్ మధ్యలో ఉన్న అట్ట గొట్టం (కార్డ్‌బోర్డ్ ట్యూబ్) రెండు చివర్లలో సిమెంట్ నింపి ఉందని రేఖ ఆ వీడియోలో పేర్కొంది. దీనిద్వారా మొత్తం బరువును పెంచి, ఒక కిలో బరువున్న వస్తువులా నమ్మించి ఉండొచ్చని ఆమె ఆరోపించింది. దీనివల్ల వాస్తవానికి ఉపయోగపడే అల్యూమినియం ఫాయిల్ పరిమాణం చాలా తక్కువగా ఉందని ఆమె తెలిపింది. తక్కువ ధరకు దొరికిందనుకున్న వస్తువు, చివరికి మోసంగా మారడంతో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, చాలామంది ఇటువంటి మోసాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరికొందరు తమకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందని కామెంట్లలో పంచుకున్నారు. కేవలం తక్కువ ధర అని మాత్రమే చూసి వస్తువులను కొనుగోలు చేయకుండా.. వాటి నాణ్యత, అసలు పరిమాణం, బరువును ఒకసారి సరిచూసుకోవాలని పలువురు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా హోల్‌సేల్ మార్కెట్లలో వస్తువులు కొనేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలన్నదే ఈ ఘటన నేర్పుతున్న గుణపాఠం.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *