“కన్న బిడ్డకే ఇలా చేయడానికి మనసెలా వచ్చిందో?”.. మద్యం మత్తులో అత్యంత కిరాతకం.. కన్న కొడుకునే బలితీసుకున్న తండ్రి పరారీ..!!!

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని బోరబండ సమీపంలో ఉన్న శిల్పినగర్ ప్రాంతంలో దుర్గా – విద్యాసాగర్ దంపతులు నివసిస్తున్నారు.

వీరిలో భర్త విద్యాసాగర్ తీవ్రమైన మద్యపానానికి బానిస కావడంతో, రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యను, తన 5 ఏళ్ల కుమారుడు విజయ్‌ను దారుణంగా కొడుతూ తరచూ గొడవ పడేవాడు.

ఈ క్రమంలో, ఘటన జరిగిన రోజు రాత్రి యధావిధిగా దుర్గ భోజనాలు వడ్డించే పనికి వెళ్లిన సమయంలో పీకలదాకా మద్యం తాగి ఇంటికి వచ్చిన విద్యాసాగర్, తన సొంత కుమారుడైన విజయ్ గొంతు నులిమి కిరాతకంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. మరుసటి రోజు ఉదయం ఇంటికి తిరిగి వచ్చిన తల్లి దుర్గ, తన కొడుకు విగతజీవుడిగా పడి ఉండటం చూసి కన్నీరుమున్నీరుగా విలపించింది.

తల్లి రోదనలు విని పరుగెత్తుకొచ్చిన ఇరుగుపొరుగు వారు బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, వాడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేసి, పరారీలో ఉన్న కిరాతక తండ్రి విద్యాసాగర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *