2023లో నాలుగో దశ పెద్దపేగు క్యాన్సర్ బారినపడిన 24 ఏళ్ల యువకుడు.. ఎన్నో చికిత్సలు తీసుకున్నప్పటికీ వ్యాధి నుంచి కోలుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అతడు సోషల్ మీడియాలో చేసిన భావోద్వేగ పోస్ట్ నెటిజన్లను కలచివేస్తోంది.
“ఈ దీపావళే నా జీవితంలో చివరి దీపావళి కావచ్చు” అంటూ అతడు చేసిన వ్యాఖ్యలు పలువురిని కంటతడి పెట్టిస్తున్నాయి. క్యాన్సర్తో తన పోరాటం చాలా కష్టంగా మారిందని, ఇక వ్యాధిపై తాను విజయం సాధించలేకపోతున్నాననే బాధను తన పోస్టులో వ్యక్తం చేశాడు.
అంతేకాకుండా, జీవితంలో తనకు ఇంకా నెరవేరని కొన్ని కలలు ఉన్నాయని తెలిపాడు. ప్రపంచమంతా పర్యటించాలని, ఒక కుక్కపిల్లను దత్తత తీసుకుని పెంచుకోవాలని తనకు ఎంతో ఆశగా ఉండేదని, కానీ ఆ కోరికలు నెరవేరకుండానే మిగిలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు.
అతడి హృదయాన్ని కదిలించే ఈ సందేశం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. అతడి పరిస్థితి గురించి తెలుసుకున్న వేలాది మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. అతడు త్వరగా కోలుకోవాలని, మరిన్ని దీపావళులు ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్నారు.

Leave a Reply