“ప్రసాదం ఇస్తానని చెప్పి బాలికలపై లైంగిక వేధింపులు. వీడియో తీసి విదేశాల్లో విక్రయం.! గుడి పూజారికి జీవిత ఖైదు, రూ. 1.43 లక్షల జరిమానా.!!”

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథుర ప్రాంతంలోని ఒక ఆలయంలో పూజారిగా పనిచేసిన శ్యామ్ బిహారీకి, బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో కోర్టు జీవిత ఖైదు విధించింది.

గుడికి వచ్చే బాలికలకు ప్రసాదం ఇస్తానని చెప్పి, వారిని ఓ ప్రత్యేక గదికి తీసుకెళ్లి లైంగికంగా వేధించినట్లు అతనిపై ఆరోపణలు వచ్చాయి.

ప్రసాదం పేరుతో బాలికలను ఒంటరి చేసిన అతడు, వారిపై అకృత్యాలకు పాల్పడిన దృశ్యాలను రహస్యంగా వీడియో తీశాడు. ఆ తర్వాత ఆ వీడియోలను విదేశాల్లో ఉంటున్న వ్యక్తులకు డబ్బులు తీసుకుని విక్రయించినట్లు విచారణలో తేలింది. ఈ వ్యవహారం అంతర్జాతీయ పోలీసుల (ఇంటర్‌పోల్) దృష్టికి వెళ్లడంతో, కేంద్ర ప్రభుత్వానికి కూడా సమాచారం అందించారు.

దీంతో ఈ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ (CBI) అధికారులు గుడిలోనే శ్యామ్ బిహారీని అరెస్టు చేశారు. గత ఏడాది ఆగస్టులో సీబీఐ తరఫున కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. దీని కొనసాగింపుగా, అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది.

కేసును విచారించిన న్యాయమూర్తి బ్రిజేష్ కుమార్, శ్యామ్ బిహారీని దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించారు. అంతేకాకుండా అతనికి రూ. 1.43 లక్షల జరిమానా కూడా విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ శిక్ష వివరాలను న్యాయవాది రాంపాల్ సింగ్ విలేకరులకు తెలియజేశారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *