“మాజీ ప్రియురాలి కొత్త ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకునే ప్లాన్!” 17 ఏళ్ల బాలుడిని రాయితో తల పగులగొట్టి చంపిన దారుణం. మరొకరిని ఇరికించేందుకు పన్నిన కుట్ర బట్టబయలు.!

కేరళలోని తిరువనంతపురంలో 17 ఏళ్ల బాలుడు అభిరామ్ దారుణ హత్యకు గురైన ఘటన దిగ్భ్రాంతిని కలిగించింది.

మాజీ ప్రియురాలి కొత్త ప్రియుడిపై పగ తీర్చుకోవడానికే పక్కా ప్రణాళికతో ఈ హత్య జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అమ్మాయిలా మాట్లాడి అభిరామ్‌ను ఒంటరిగా రప్పించి హత్య చేసినట్లు మరో 17 ఏళ్ల బాలుడిపై ఆరోపణలు వచ్చాయి.

నిందితుడైన బాలుడి మాజీ ప్రియురాలు మరొకరితో తిరగడం ప్రారంభించినట్లు చెబుతున్నారు. ఆ కొత్త ప్రియుడు, మృతి చెందిన అభిరామ్ స్నేహితుడని సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన బాలుడు, ఆ యువకుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం తన ప్రస్తుత ప్రియురాలి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఉపయోగించి, అమ్మాయిలా అభిరామ్‌తో మాట్లాడాడు. ఆ తర్వాత అతడిని కలవడానికి రావాలని పిలిచాడు.

అభిరామ్ చెప్పిన ప్రదేశానికి వెళ్లగా, అక్కడ అమ్మాయికి బదులు నిందితుడైన బాలుడు ఉన్నట్లు సమాచారం. తన స్నేహితుడిని (కొత్త ప్రియుడు) అక్కడికి రప్పించాలని అభిరామ్‌ను బలవంతం చేశాడు. కానీ, ఆ స్నేహితుడు రాకపోవడంతో అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించిన అభిరామ్‌ను రాయితో తలపై బలంగా కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం 22 ఏళ్ల ఉమర్ సహాయంతో మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కి నిర్మానుష్య ప్రాంతంలో పడేసినట్లు విచారణలో తేలింది.

మరోవైపు, ఇల్లు విడిచి వెళ్లిన అభిరామ్ ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొనసాగిన గాలింపు, దర్యాప్తులో పంగప్పారై ప్రాంతంలో గోనెసంచిలో కుక్కి ఉన్న అతని మృతదేహాన్ని గుర్తించారు. ఈ హత్యకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశారని, ఒక యువతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని సమాచారం. ప్రతీకారం కోసమే 17 ఏళ్ల బాలుడిని హత్య చేసిన ఘటన కేరళలో తీవ్ర కలకలం రేపింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *