ప్రశాంతంగా జరుగుతున్న క్యాబినెట్ సమావేశం. ప్రభుత్వ అతిథి గృహం గేటు వద్ద ఢీకొన్న కార్లు! వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో.!

ముంబైలో క్యాబినెట్ సమావేశం జరుగుతున్న సమయంలో, ప్రభుత్వ అతిథి గృహం సమీపంలో రెండు కార్లు ముఖాముఖి ఢీకొన్న ఘటన తీవ్ర కలకలం రేపింది.

ఈ ప్రమాదం బుధవారం జరిగినట్లు సమాచారం. మహారాష్ట్రకు చెందిన పలువురు సీనియర్ మంత్రులు సమావేశంలో పాల్గొనేందుకు అక్కడికి చేరుకున్న సమయంలో, అతిథి గృహం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొనడంతో పాటు, వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది.

ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను ఒక వార్తా సంస్థ విడుదల చేసింది. అందులో బ్లూ కలర్ (నీలం రంగు) సెడాన్ కారు, వైట్ కలర్ (తెలుపు రంగు) ఫార్చ్యూనర్ కారు.. ఈ రెండు వాహనాలు ఢీకొన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా నీలం రంగు కారు ముందు భాగంతో పాటు ఇతర ప్రాంతాల్లో జరిగిన నష్టం దృశ్యాల్లో రికార్డైంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా, నీలం రంగు ఫార్చ్యూనర్ కారును ఒక వృద్ధుడు నడుపుతున్నట్లు చెబుతున్నారు. మరో కారు ఎలా వచ్చి ఢీకొట్టింది, ప్రమాదం జరగడానికి గల కారణాలపై పూర్తి వివరాలు ఇంకా వెలువడలేదు. ఈ ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయా అనే దానిపై కూడా స్పష్టమైన సమాచారం లేదు.

క్యాబినెట్ సమావేశం జరుగుతున్న ముఖ్యమైన ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడంతో, అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రెండు కార్లు ఢీకొన్న దృశ్యాలు ఇంటర్నెట్‌లో విడుదలై అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రమాదానికి గల కారణం, అందులో ఎవరికైనా గాయాలయ్యాయా అనే దానిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *