“ప్రముఖ నటి అతుల్య చంద్ర సంచలన అరెస్ట్” – దోపిడీ, బెదిరింపులు సహా 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు!

కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో ఒక వైద్యుడికి అబద్ధపు కారణం చెప్పి ఇంటికి పిలిపించి, ఆయనపై దారుణంగా దాడి చేసి వస్తువులను దోచుకున్న కేసులో ప్రముఖ దక్షణాది నటి అతుల్య చంద్ర, ఆమెతో ఉన్న మరో ఇద్దరిని పోలీసులు ఆకస్మికంగా అరెస్ట్ చేశారు.

ఈ సంఘటన సినీ పరిశ్రమలోనే కాకుండా ప్రజల్లోనూ తీవ్ర దిగ్భ్రాంతిని, సంచలనాన్ని రేకెత్తించింది.

బాధితుడైన 41 ఏళ్ల వైద్యుడు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, నవంబర్ 2న నిందితుల్లో ఒకరి అత్త తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోందని చెప్పి, వైద్య సహాయం కోసం కొచ్చిలోని వైట్టిలాలో ఉన్న ‘ఎసెన్ స్ప్రింగ్‌డేల్’ అపార్ట్‌మెంట్‌కు ఆయనను పిలిపించారు. అయితే అక్కడికి వెళ్లిన వైద్యుడికి ఊహించని షాక్ ఎదురైంది.

వైద్యుడు అపార్ట్‌మెంట్‌లోకి అడుగుపెట్టగానే, నటి అతుల్య చంద్రతో సహా సుమారు 12 మంది ముఠా అక్కడ చుట్టుముట్టింది. ఆ ముఠా వైద్యుడిపై బడి దారుణంగా దాడి చేయడమే కాకుండా, ఆయన వద్ద ఉన్న రెండు మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్, ఇయర్‌పాడ్స్‌ను బలవంతంగా లాక్కుంది. దోచుకున్న ఆ వస్తువుల మొత్తం విలువ సుమారు రూ. 3.25 లక్షలు ఉంటుందని తెలిపారు.

అంతేకాకుండా, ఆ ముఠాలోని ఒకరి అత్తకు డాక్టర్ మత్తుమందు ఇచ్చి లైంగిక వేధింపులకు గురిచేశాడని అబద్ధపు ఆరోపణలు మోపుతూ దాడి కొనసాగించారు. ఈ దాడి సమయంలో నటి అతుల్య చంద్ర తనను తీవ్రంగా బూతులు తిట్టడమే కాకుండా, ప్రాణాలతో వదిలిపెట్టమని హత్య బెదిరింపులకు దిగిందని వైద్యుడు తన ఫిర్యాదులో కన్నీళ్లతో పేర్కొన్నారు.

వైద్యుడి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన పోలీసులు, భారతీయ నాయ సంహిత చట్టం కింద అక్రమ నిర్బంధం (సెక్షన్ 127), గాయపరచడం (సెక్షన్ 115), అసభ్యకర ప్రవర్తన (సెక్షన్ 296), క్రిమినల్ బెదిరింపు (సెక్షన్ 351) మరియు దోపిడీ (సెక్షన్ 310) వంటి కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ‘మత్తు వదలా రా’, ‘మత్తు వదలా రా 2’, ‘ఉయిర్’ తదితర పలు దక్షణాది చిత్రాల్లో నటించిన నటి ఈ దారుణ ఘటనలో అరెస్ట్ కావడం తీవ్ర వివాదాస్పదంగా మారింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *