మధ్యప్రదేశ్ రాష్ట్రం సత్నా జిల్లాలో, ఓ బాలిక హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి బెయిల్‌పై బయటకు రాగానే.. అతని మద్దతుదారులు భారీ ర్యాలీగా వెళ్లి ఘన స్వాగతం పలికిన ఘటన తీవ్ర వివాదాస్పదమైంది.
‘పెట్టు’ అని పిలిచే మాన్ సింగ్ గత 14 నెలలుగా ఈ కేసులో జైలులో ఉన్నాడు. న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి బయటకు రాగా, మద్దతుదారులు పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అతడిని భారీ ర్యాలీగా ఊరేగించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఈ ర్యాలీలో చోటుచేసుకున్న దృశ్యాలే ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. మాన్ సింగ్ కదులుతున్న బొలెరో కారు ముందు భాగంలో (బానెట్‌పై) కూర్చుని సిగరెట్ తాగుతూ వెళ్లినట్లు వీడియోలో రికార్డ్ అయింది. కారు వెనుక భారీ సంఖ్యలో ద్విచక్రవాహనాల్లో మద్దతుదారులు వరుసకట్టి వెళ్లారు. రోడ్డుపై ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ ర్యాలీ సాగినట్లు స్పష్టమవుతోంది. అంతేకాకుండా, ఈ ర్యాలీ కొల్గావాన్ పోలీస్ స్టేషన్ ముందు నుంచే వెళ్లి సిద్ధార్థ్ నగర్ ప్రాంతంలో ముగిసినట్లు సమాచారం.
హత్య కేసులో నిందితుడైన వ్యక్తి బెయిల్‌పై బయటకు రాగానే, ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి బలప్రదర్శన చేయడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. ముఖ్యంగా, పోలీస్ స్టేషన్ ముందు నుంచి ర్యాలీ వెళ్లినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కదులుతున్న కారు బానెట్‌పై కూర్చుని ప్రయాణించడం ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధం కావడమే కాకుండా, అతనికి, ఇతర వాహనదారులకు కూడా ప్రమాదకరం.
ఈ ర్యాలీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వేగంగా వైరల్ అవుతోంది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ర్యాలీపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. బాలిక హత్య కేసులో నిందితుడు బెయిల్‌పై బయటకు రావడం న్యాయస్థానం ఆదేశమే అయినప్పటికీ, ఆ తర్వాత జరిగిన ఈ ర్యాలీ కొత్త వివాదాన్ని సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

Leave a Reply