మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న ఓ మద్యం దుకాణంలో పనిచేస్తున్న 39 ఏళ్ల ఉద్యోగి ఛాతీలో మేకు దూసుకెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆ రాష్ట్రాన్ని కుదిపేసింది.
సిడ్కో ప్రాంతంలో ఉన్న ‘లిక్కర్ కట్టా’ అనే మద్యం దుకాణంలో పనిచేస్తున్న సునీల్ అనిల్ తాయ్డే, సోమవారం సాయంత్రం కౌంటర్ వద్ద నిలబడి ఉండగా అకస్మాత్తుగా తీవ్రమైన ఛాతీ నొప్పితో కేకలు వేస్తూ కుప్పకూలిపోయాడు.
తోటి ఉద్యోగులు అతన్ని రక్షించి ఆసుపత్రిలో చేర్పించగా, ప్రెషర్ గన్ (నెయిల్ గన్) ద్వారా కొట్టే ఒక ఇనుప మేకు అతని గుండెలోకి నేరుగా దూసుకెళ్లినట్లు పరీక్షల్లో తేలింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు విడిచాడు.
మొదట్లో ఇది ప్లైవుడ్ పనుల కోసం వాడే ప్రెషర్ గన్ ప్రమాదవశాత్తు పేలడం వల్ల జరిగిన ప్రమాదంగా భావించినప్పటికీ, దుకాణంలోని సీసీటీవీ దృశ్యాలు బయటకు వచ్చిన తర్వాత ఈ ఘటన చుట్టూ తీవ్ర మిస్టరీ (అనుమానాలు) నెలకొంది.
సీసీటీవీ దృశ్యాల్లో అక్కడ ఉన్న ఓ కస్టమర్ కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో, ఇది కేవలం ప్రమాదమా లేక పథకం ప్రకారం జరిగిన హత్యనా అనే కోణంలో పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply