“చెత్తకుప్పలో ముక్కలు ముక్కలుగా దొరికిన కాళ్లు.!” రోడ్డుపై పడి ఉన్న మనిషి శరీర భాగాలు. భయాందోళనలకు గురైన జనం. పుణెను ఉలిక్కిపడేలా చేసిన భయానక ఘటన.!!

మహారాష్ట్రలోని పుణె సమీపంలో ఉన్న పింప్రి-చించ్‌వాడ్ పరిధిలోని పింప్లే గురవ్ (Pimple Gurav) ప్రాంతంలో అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగుచూసింది.

రామకృష్ణ మంగళ్ కార్యాలయం నుంచి కాటేపురం చౌక్ వెళ్లే రోడ్డు సమీపంలో ఉన్న ఒక చెత్తకుప్పలో రెండు మనిషి కాళ్లు లభ్యమయ్యాయి.

స్వాధీనం చేసుకున్న ఆ శరీర భాగాలు ఒక పురుషుడివి కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.

ఆ శరీర భాగాలు ఎవరివి, ఆ వ్యక్తి ఎవరు తదితర వివరాలు ఇంకా తెలియరాలేదు. రోడ్డు పక్కన చెత్తకుప్పలో మనిషి కాళ్లు దొరకడంతో ప్రస్తుతం ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం, భయాందోళనలు నెలకొన్నాయి.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *