“నూడుల్స్ ప్యాకెట్లలో రూ.3.72 కోట్ల గంజాయా..?” నవంబర్ 18 వరకు జైలు. అంతర్జాతీయ డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టు రట్టు చేసిన అధికారులు.. విదేశీ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో ప్రయాణికుడు అరెస్ట్..!!

బ్యాంకాక్ నుంచి పుణె అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఒక భారతీయ ప్రయాణికుడి నుంచి సుమారు రూ.3.72 కోట్ల విలువైన 10.642 కిలోల ‘హైడ్రోపోనిక్ గంజాయి’ని పుణె కస్టమ్స్ అధికారులు పక్కా సమాచారంతో స్వాధీనం చేసుకున్నారు.

ఆ ప్రయాణికుడు తన లగేజీ బ్యాగులోని ఆహార పదార్థాల (కమర్షియల్ ఫుడ్ ఐటమ్స్) మధ్య ఈ డ్రగ్స్‌ను అత్యంత చాకచక్యంగా దాచి తీసుకొచ్చాడు.

‘ఫ్రీజ్ డ్రైడ్ మోన్ థాంగ్ దురియన్’ (Freeze Dried Monthong Durian) అని పేరున్న తొమ్మిది వాక్యూమ్ సీల్డ్ ప్యాకెట్లలో, నూడుల్స్ ప్యాకెట్ల మధ్య ఈ మత్తుపదార్థాన్ని దాచి ఉంచినట్లు కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో బయటపడింది.

దీంతో సదరు ప్రయాణికుడిని మాదకద్రవ్యాల నిరోధక (NDPS) చట్టం కింద అరెస్టు చేసిన అధికారులు కోర్టులో హాజరుపరచగా, అతడికి నవంబర్ 18వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ (రిమాండ్) విధించారు.

ఈ అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా వెనుక ఉన్న ఇతర వ్యక్తులను గుర్తించి పట్టుకునేందుకు పుణె కస్టమ్స్ అధికారులు తమ దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *