నెమ్మదిగా కదులుతున్న రైలు కిటికీ గుండా చేయి పెట్టి వస్తువులను దొంగిలించి పారిపోయేందుకు యత్నించిన ఓ దొంగకు, ప్రయాణికులు ఊహించని షాక్ ఇచ్చిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.
సాధారణంగా రైళ్లు స్టేషన్ నుండి బయలుదేరే సమయంలో దొంగతనం చేసి పారిపోవడం దొంగల కిటుకు. కానీ ఈసారి ప్రయాణికుల అప్రమత్తతతో ఆ దొంగ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
కిటికీలోంచి చేయి పెట్టి దొంగతనానికి యత్నించిన దొంగ చేతిని లోపల ఉన్న ప్రయాణికులు గట్టిగా పట్టుకోవడంతో, రైలు కదులుతున్నప్పటికీ అతను తప్పించుకోలేకపోయాడు.
ఆ తర్వాత రైలు ఆగగానే బయట ఉన్నవారి సహాయంతో ప్రయాణికులు ఆ దొంగను రైలు బోగీలోకి లాగి అతడికి సరైన గుణపాఠం చెప్పారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, దొంగలకు ఇలా బుద్ధి చెప్పడం సరైనదేనని కొందరు అంటుంటే, పండుగ సమయం కాబట్టి కాస్త కనికరించి వదిలేయాల్సిందని మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply