తొలి టెస్ట్‌లోనే డబుల్ సెంచరీ.! “కొత్త చరిత్ర సృష్టించిన యువ ఆటగాడు”. 21 బౌండరీలు, 11 సిక్సర్లు. బౌలర్లను హడలెత్తించిన బంగ్లాదేశ్ అరంగేట్ర ఆటగాడు. వేరే లెవల్ రికార్డ్..!!

వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో, బంగ్లాదేశ్ యువ బ్యాట్స్‌మెన్ తౌహిద్ హృదయ్ (Towhid Hridoy) తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ముష్ఫికర్ రహీమ్ రికార్డును బద్దలు కొట్టి చారిత్రాత్మక డబుల్ సెంచరీ నమోదు చేశాడు.

మ్యాచ్ మూడో రోజున బంగ్లాదేశ్ జట్టు 88 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన తౌహిద్ హృదయ్ బాధ్యతాయుతంగా ఆడి తన తొలి టెస్ట్ సెంచరీని సాధించాడు. సెంచరీ పూర్తయిన తర్వాత తన దూకుడును ప్రదర్శించిన అతను, క్లిష్ట పరిస్థితుల్లోనూ తన అద్భుతమైన ఆటతీరుతో జట్టును కష్టాల నుంచి గట్టెక్కించాడు.

359 బంతులు ఎదుర్కొన్న తౌహిద్ హృదయ్, 22 బౌండరీలు, 11 భారీ సిక్సర్లతో 242 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. దీని ద్వారా టెస్ట్ క్రికెట్‌లో బంగ్లాదేశ్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ముష్ఫికర్ రహీమ్ (219 పరుగులు) రికార్డును హృదయ్ అధిగమించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా, టెస్ట్ క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన 4వ బంగ్లాదేశ్ ఆటగాడిగా ఘనత సాధించాడు.

ఒక టెస్ట్ ఇన్నింగ్స్‌లో 11 సిక్సర్లు బాదిన హృదయ్, బంగ్లాదేశ్ తరఫున ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇందులో 10 సిక్సర్లు అతను సెంచరీ చేసిన తర్వాత కొట్టినవే కావడం విశేషం. వరుసగా వికెట్లు కోల్పోయి తడబడుతున్న జట్టును తైజుల్ ఇస్లాం (22 పరుగులు) మరియు తస్కిన్ అహ్మద్‌ల సహకారంతో ఆదుకున్న హృదయ్.. 8వ వికెట్‌కు 117 పరుగులు, 9వ వికెట్‌కు 85 పరుగులు జోడించి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 386 పరుగులు చేసేందుకు సహాయపడ్డాడు. తద్వారా వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరైన 356 పరుగులను దాటి, బంగ్లాదేశ్ 30 పరుగుల ఆధిక్యం సాధించేలా చేశాడు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *