అమెరికాలోని జార్జియా రాష్ట్రం కొలంబియా కౌంటీలో జరిగిన ఓ ప్రసిద్ధ ఫెయిర్ (ఎగ్జిబిషన్)లో, భద్రతా నిబంధనలను పట్టించుకోకుండా బాలురు చేసిన ఆకతాయి చేష్టల వల్ల ఓ పెను ప్రమాదం చోటుచేసుకుంది.
అక్కడ గాలిలో వేగంగా తిరిగే ఓ హ్యాంగింగ్ రైడ్ (రాట్నం) ఎక్కిన 13 ఏళ్ల ఇద్దరు బాలురు, అధికారుల నిరంతర హెచ్చరికలను ఏమాత్రం లెక్కచేయకుండా అత్యంత ప్రమాదకరంగా ప్రవర్తించారు.
రాట్నం వేగంగా తిరుగుతున్న సమయంలో, వాళ్లిద్దరూ కావాలనే ఒకరి సీటును మరొకరు పట్టుకుని లాగుతూ ఆడుకున్నారు. రాట్నం వేగం తగ్గుతున్న సమయంలో వారు తమ నియంత్రణ కోల్పోవడంతో, గాలిలో వేలాడుతున్న ఆ సీట్లు ఒకదానికొకటి బలంగా ఢీకొని ప్రమాదానికి గురయ్యాయి.
ఈ ఘోర ప్రమాదంలో కింద నిలబడి ఉన్న ఓ మహిళ తీవ్రంగా గాయపడగా, వెంటనే ఆమెను అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. అలాగే, ప్రమాదానికి కారణమైన ఇద్దరు బాలురకు సైతం స్వల్ప గాయాలయ్యాయి. నిబంధనలను ఉల్లంఘించి ఈ ప్రమాదానికి కారణమైన ఆ ఇద్దరు బాలురపై కొలంబియా కౌంటీ షెరీఫ్ కార్యాలయ అధికారులు కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకున్నారు.

Leave a Reply