బాత్రూమ్ తలుపు మూసి ఉంచడం మంచి అలవాటు అని చాలామంది అనుకుంటారు. కానీ, కరోనా తర్వాత గాలి స్వచ్ఛత, పరిశుభ్రతపై అవగాహన పెరిగిన నేపథ్యంలో, దీనికి పూర్తి భిన్నమైన వాస్తవాన్ని కొత్త అధ్యయనాలు వెల్లడించాయి.
బాత్రూమ్లోని టాయిలెట్‌ను ‘ఫ్లష్’ చేసినప్పుడు, కంటికి కనిపించని సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా గాలిలో వ్యాపిస్తాయి. ఇవి వెంటనే మాయమైపోవు.
బాత్రూమ్ తలుపును ఎప్పుడూ మూసి ఉంచడం వల్ల, ఆ సూక్ష్మక్రిములు బయటికి వెళ్లే దారి లేక గదిలోనే ఉండిపోతాయి. కాలక్రమేణా వాటి సంఖ్య అనేక రెట్లు పెరుగుతుంది. ‘జర్నల్ ఆఫ్ హజార్డస్ మెటీరియల్స్’లో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం, మూసి ఉన్న చిన్న గదిలో ఈ సూక్ష్మజీవుల పెరుగుదల చాలా ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
దీనివల్ల బాత్రూమ్ తలుపు మూసి ఉన్నప్పుడు అక్కడి కలుషిత గాలి బయటకు వెళ్లలేక లోపలే నిలిచిపోతుంది. ఆ తర్వాత మనం తలుపు తెరిచినప్పుడు, ఆ విషపూరిత సూక్ష్మజీవులు గాలిలో కలిసిపోయి మన శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశించి పలు ఆరోగ్య సమస్యలు కలిగించే అవకాశం ఉంది.

Leave a Reply