“మీరే అంత్యక్రియలు చేసేయండి.. మాకు వీడియో కాల్‌లో చూపిస్తే చాలు..!” 5గురు కూతుళ్లు, అల్లుళ్లు ఉన్నా అనాథలా ముగిసిన జీవితం.. చలించిపోయిన సమాజం.. వైరల్ అవుతున్న వీడియో..!!

హర్యానా రాష్ట్రం పానిపట్ ప్రాంతంలో తన జీవితాన్నంతా పిల్లల భవిష్యత్తు కోసమే ధారపోసిన 65 ఏళ్ల సుశీల్ కుమార్ సింగ్ అనే వ్యక్తి గుండెపోటుతో దయనీయ స్థితిలో మృతి చెందాడు.

ఆయనకు ఐదుగురు కూతుళ్లు, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ, అంత్యక్రియల్లో పాల్గొనడానికి తాము రాలేమని వారు కరాఖండిగా తేల్చిచెప్పారు.

ప్రయాణ ఖర్చులు కూడా తామే భరిస్తామని చెప్పినా ఎవరూ రాకపోవడంతో, చివరకు ‘జన్ సేవా దళ్’ అనే సామాజిక సంస్థే ముందుండి ఆయనకు అంత్యక్రియలు నిర్వహించింది.

కన్న తండ్రికి కడసారి వీడ్కోలు పలకడానికి కూడా రాలేని ఆ పిల్లలు, గత్యంతరం లేక తమ మొబైల్ ఫోన్లలో వీడియో కాల్ ద్వారా ఆ తంతును చూసి సరిపెట్టుకున్నారు.

కన్నవారిని ఇలా నిర్దాక్షిణ్యంగా వదిలేసే అమానవీయ ఘటనలు యావత్ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురిచేస్తున్నాయి.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *