దీపావళి పండుగ సందర్భంగా పక్కింటి దగ్గర నిలబడి ఓ వ్యక్తి సరదాగా టపాసులు కాలుస్తుండగా, ఊహించని విధంగా ఒక అపశ్రుతి చోటుచేసుకుంది.
అతను వెలిగించిన టపాసు నేరుగా వెళ్లకుండా, వంకరతిరిగి పక్కనే ఆపి ఉంచిన ఓ కారు కిందకు దూసుకెళ్లింది.
కారు కిందకు ఆ టపాసు వెళ్లి మంటలు రావడం గమనించిన ఆ వ్యక్తి, భయంతో వణికిపోయి వెంటనే ఏం చేయాలో పాలుపోక బిత్తరపోయాడు.
కారు ఎక్కడ కాలిపోతుందోనన్న భయంతో చుట్టుపక్కల చూసిన అతడు, వెంటనే దగ్గర్లో ఉన్న ఒక పెద్ద రాయిని తీసుకువచ్చి మంటపై వేసి దాన్ని ఆర్పే ప్రయత్నం చేశాడు.
అదృష్టవశాత్తూ పక్కింటి వారు ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో ఈ విచిత్రమైన, ఫన్నీ దృశ్యం స్పష్టంగా రికార్డ్ అయి, ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారుతోంది.

Leave a Reply