భారత క్రికెట్ జట్టు యువ ఓపెనర్ అభిషేక్ శర్మ, దీపావళి పండుగ సమయంలో అనుకోకుండా తన పాత స్కూల్ టీచర్ ఇంటి మీదుగా వెళ్లాడు.
అప్పుడు, చాలా రోజుల తర్వాత తన టీచర్‌ను నేరుగా కలిసి ఆమెకు ఒక మధురమైన సర్ప్రైజ్ ఇవ్వాలని అతడు నిర్ణయించుకున్నాడు.
తన కారు దిగి ముఖానికి ఉన్న మాస్క్ తీసేసి గుమ్మం వద్దకు వచ్చిన అభిషేక్ శర్మను చూడగానే ఆ టీచర్ తీవ్ర ఆశ్చర్యంలో మునిగిపోయింది. వెంటనే అతడిని గుర్తుపట్టిన ఆమె, ‘ఓ దేవుడా! ఇది ఎంత పెద్ద సర్ప్రైజ్!’ అంటూ భావోద్వేగంతో కేకలు వేసి, తన పాత విద్యార్థిని ఆప్యాయంగా హత్తుకుని లోపలికి ఆహ్వానించింది.
హృదయాన్ని హత్తుకునే ఈ క్షణం అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డై, ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఉపాధ్యాయురాలు, విద్యార్థి మధ్య ఉన్న అనుబంధం తరగతి గదిని దాటి ఎప్పటికీ మారదని నిరూపించే ఈ వీడియో.. నెటిజన్ల మనసు దోచుకుంటోంది.
చిన్నతనంలో విద్యాబుద్ధులు నేర్పిన టీచర్‌పై, కీర్తి శిఖరాగ్రాన ఉన్నప్పటికీ భారత స్టార్ క్రికెటర్ అభిషేక్ శర్మ చూపించిన గౌరవం, ప్రేమను ప్రతి ఒక్కరూ ఎంతగానో ప్రశంసిస్తున్నారు. తన శిష్యుడిని చూసి ఆ టీచర్ ముఖంలో వెల్లివిరిసిన ఆనందమే ఈ వీడియోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Leave a Reply