ఒక కన్నును కోల్పోయిన చిన్నారికి భారత వైద్యులు, కృత్రిమ కన్నుతో కొత్త ఆత్మవిశ్వాసాన్ని అందించారు. చూపును తిరిగి తీసుకురాలేకపోయినా.. చిన్నారి ముఖంలో చిరునవ్వు పూయించారు. ఈ ప్రత్యేక ప్రయత్నం ప్రస్తుతం సోషల్ మీడియాలో పలువురిని భావోద్వేగానికి గురిచేస్తోంది.
భారత్లోని ‘సువితా ఐ సర్వీసెస్’ వైద్య కేంద్రం ఈ వినూత్న ప్రయత్నం చేసింది. ఒక కన్నును కోల్పోయిన చిన్నారికి, ఆమె ఆరోగ్యంగా ఉన్న మరో కన్ను మాదిరిగానే కనిపించేలా ప్రత్యేకంగా కృత్రిమ కన్నును రూపొందించి అందించారు.
కృత్రిమ కన్నుల తయారీలో నైపుణ్యం కలిగిన నిపుణులు, రెసిన్ కళాకారులు కలిసి ఆధునిక సాంకేతికత, తమ కళాత్మక నైపుణ్యంతో ఈ కృత్రిమ కన్నును తయారు చేశారు. చిన్నారి సహజమైన మరో కన్ను రంగు, పరిమాణం, ఆకృతి, రక్తనాళాల నమూనాలను జాగ్రత్తగా పరిశీలించి, వాటికి సరిపోయేలా కృత్రిమ కన్నును రూపొందించారు.
ఈ కృత్రిమ కన్నును ప్రత్యేకంగా తయారు చేసిన అద్దాల్లో అమర్చారు. దీంతో బయటకు చూసినప్పుడు అది చిన్నారి సహజమైన కన్నులాగే కనిపిస్తుంది.
అయితే, ఈ కృత్రిమ కన్ను చూపును తిరిగి తీసుకురాదు. కానీ ఇతరులతో కలిసిమెలిసి ఉండేటప్పుడు చిన్నారి ఎదుర్కొనే ఇబ్బంది, సంకోచాన్ని తగ్గించడంతోపాటు ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు సహాయపడుతుంది.
ఒక కన్నును కోల్పోయిన చిన్నారికి మళ్లీ చిరునవ్వు తెప్పించిన ఈ ప్రయత్నం నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. వైద్య విజ్ఞానం, కళాత్మక నైపుణ్యం కలిస్తే ఒకరి జీవితంలో ఎంతటి సానుకూల మార్పు తీసుకురాగలవో ఈ ఉదంతం చాటిచెబుతోంది.

Leave a Reply