బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతంలో భర్తను హత్య చేసి, అతడు గుండెపోటుతో చనిపోయాడని నాటకమాడిన భార్యను, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అనితకు, అదే ప్రాంతానికి చెందిన మధుసూదన్‌తో వివాహేతర సంబంధం ఉంది. వారి బంధానికి భర్త ఉపేంద్ర అడ్డుగా ఉన్నాడు.
దీంతో ఇద్దరూ కలిసి ఉపేంద్రను ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. ఆ తర్వాత అతడు బాత్రూమ్‌లో స్పృహ తప్పి పడిపోయి, గుండెపోటుతో మరణించాడని నాటకమాడి అందరినీ నమ్మించారు.
మొదట ఇది సహజ మరణంగానే భావించినప్పటికీ, పోస్టుమార్టం నివేదికలో తలెత్తిన అనుమానాలతో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేసి అసలు నిజాన్ని వెలికితీశారు.
భర్తను అడ్డుతొలగించుకున్న నేరానికి అనిత, మధుసూదన్‌లను పోలీసులు అరెస్టు చేసిన ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.

Leave a Reply