ఒక బెలూన్ ఆట. క్షణాల్లో జరిగిన ఘోరం.! 13 ఏళ్ల బాలికకు విషాదాంతం. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబం.!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బదాయూన్ జిల్లాలో బెలూన్ ఊదుతూ గొంతులో ఇరుక్కుని ఊపిరిరాడక 13 ఏళ్ల బాలిక మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో ఊహించని విధంగా ఈ ఘోరం జరిగింది. బాలికను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆమెను కాపాడలేకపోయారు.

బదాయూన్ జిల్లా పరిధిలోని బిల్సీ ప్రాంతం కటౌలీ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రామ్‌దయాళ్ మౌర్య 13 ఏళ్ల మనవరాలు నందిని, గత నెల రోజులుగా తన అమ్మమ్మ వాళ్ల ఇంట్లోనే ఉంటోంది. సరహ్ బరౌలియా గ్రామానికి చెందిన నందిని నాలుగో తరగతి చదువుతోంది.

ఘటన జరిగిన రోజు ఇంట్లో బెలూన్‌తో ఆడుకుంటున్న నందిని, దానిని ఊదేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ బెలూన్ ఆమె గొంతులో ఇరుక్కుపోయినట్లు సమాచారం. దీంతో ఆమెకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. బాలిక పరిస్థితి విషమించడాన్ని చూసిన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెంది, వెంటనే బిల్సీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

అయితే, బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. నెల రోజులుగా ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటున్న చిన్నారి అకస్మాత్తుగా మృతి చెందడంతో బంధువులు, గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *