“నా చేతిలో తుపాకీ ఉంది.. సైలెంట్ గా రా..!” 12 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసేందుకు యత్నించిన కిరాతకుడు.. ప్రాణాలకు తెగించి కాపాడిన 4 పిల్లల తండ్రి.. జాతీయ హీరోగా మారిన దుకాణ యజమాని.. వైరల్ వీడియో..!!

బ్రెజిల్‌లోని సావో పాలో రాష్ట్రంలో ఉన్న బావురు నగరంలో, 12 ఏళ్ల బాలిక తన స్నేహితురాలితో కలిసి పాఠశాలకు వెళుతుండగా.. 26 ఏళ్ల విక్టర్ గుస్తావో అనే వ్యక్తి తన వద్ద ఆయుధం ఉందని బెదిరించి, సమీపంలోని ఓ పాడుబడిన ప్రదేశానికి బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు.

ఆ సమయంలో తన కొడుకును స్కూల్‌లో దిగబెట్టి కారులో తిరిగి వస్తున్న 31 ఏళ్ల విలియం రిబేరో అనే నలుగురు పిల్లల తండ్రి, ఆ వ్యక్తి ప్రవర్తనపై అనుమానం వచ్చి వారిని వెంబడించి గమనించాడు.

బాలిక వద్దకు వెళ్లి ఆరా తీయగా.. ఆమె భయంతో ఏడుస్తూ ఆ వ్యక్తి ఎవరో తనకు తెలియదని చెప్పడంతో, విలియం వెంటనే స్పందించి ఆ వ్యక్తిని పట్టుకుని పోరాడి బాలికను కాపాడాడు. తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించిన ఆ నిందితుడిని స్థానికులు, మోటార్‌సైకిల్ డ్రైవర్లు వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

పోలీసుల విచారణలో ఆ వ్యక్తి, ‘ఆ బాలిక నన్ను చూసిన విధానం నాకు నచ్చింది, అందుకే ఆమెకు కూడా నేను నచ్చానని అనుకున్నాను’ అని చెప్పడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ప్రస్తుతం అతనిపై లైంగిక దాడి యత్నం కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.

తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బాలికను కాపాడిన విలియమ్‌ను బ్రెజిల్ ప్రజలు గొప్ప హీరోగా కీర్తిస్తున్నారు. ప్రజలు తనకు బహుమతిగా ఇచ్చిన డబ్బును, కార్లను ఆయన సున్నితంగా తిరస్కరించగా.. ప్రస్తుతం అతను నడుపుతున్న రెస్టారెంట్ వ్యాపారం రెట్టింపు కావడం విశేషం.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *