రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్‌పూర్ జిల్లా భిందర్ ప్రాంతంలో, డ్రైవర్ లేకుండా నడిచిన ఒక ద్విచక్ర వాహనం అకస్మాత్తుగా పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
రోడ్డుపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఈ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఢీకొన్న వేగానికి ఒక బైక్‌పై ప్రయాణిస్తున్న వారు అదుపుతప్పి కింద పడిపోగా, ఆ వాహనం మాత్రం వారి నుంచి విడిపోయి డ్రైవర్ లేకుండానే ముందుకు దూసుకెళ్లింది.
రోడ్డుపై వెళ్తున్న ఆ బైక్, అదుపు తప్పి వేగంగా సమీపంలోని పెట్రోల్ బంక్‌లోకి ప్రవేశించింది. ఆ సమయంలో అక్కడ వాహనాలకు పెట్రోల్ నింపే పనులు జరుగుతున్నాయి. అకస్మాత్తుగా బైక్ లోపలికి దూసుకురావడం చూసిన అక్కడి సిబ్బంది, ప్రజలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ముఖ్యంగా, ఆ వాహనం పెట్రోల్ డిస్పెన్సర్ల (యంత్రాల) సమీపానికి వెళ్లడంతో ఏదైనా పెను ప్రమాదం జరుగుతుందేమోనన్న భయాందోళనలు నెలకొన్నాయి.
కానీ అదృష్టవశాత్తూ, ఆ బైక్ పెట్రోల్ నింపే యంత్రాలను ఢీకొట్టకుండా, పెట్రోల్ బంక్ గోడను డీకొట్టి ఆగిపోయింది. దీంతో మంటలు అంటుకుని భారీ ప్రమాదం జరిగే ముప్పు తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. రెండు బైక్‌లు ఢీకొనడంతో మొదలైన ఈ సంఘటన, డ్రైవర్ లేని వాహనం పెట్రోల్ బంక్‌లోకి దూసుకుపోవడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠ రేపింది.
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం విడుదలై నెట్టింట వైరల్‌గా మారాయి. అందులో, డ్రైవర్ లేకుండా బైక్ వేగంగా పెట్రోల్ బంక్‌లోకి ప్రవేశించి గోడను ఢీకొట్టిన దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. రోడ్డుపై జరిగిన చిన్న ప్రమాదం, పెట్రోల్ బంక్‌లో భారీ విపత్తుగా మారే అవకాశం ఉండటం చూసేవారిని వణికిస్తోంది. అయితే, అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply