కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తన ఆత్మకథలో, 1969 జనవరిలో తన తొలి బిడ్డను కోల్పోయిన విషాద ఘట్టాన్ని పంచుకున్నారు.
గర్భవతిగా ఉన్న సోనియా గాంధీకి నిర్ణీత సమయానికి రెండు నెలల ముందుగానే, 1969 జనవరి 18న సాధారణ ప్రసవంలో ఓ అందమైన మగబిడ్డ జన్మించాడు.
కానీ, పుట్టిన ఒక్క రోజులోనే ఆ పసికందు కన్నుమూశాడు. ఆ ఘోరకలిని తట్టుకోలేక తానూ, తన భర్త రాజీవ్ గాంధీలు తీవ్ర దిగ్భ్రాంతికి గురై, కుంగిపోయామని ఆమె ఆ పుస్తకంలో పేర్కొన్నారు.
బిడ్డ మృతదేహాన్ని నదిలో వదలకుండా, ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో ఉన్న తమ కుటుంబ ఫామ్‌హౌస్‌లో ఓ గులాబీ మొక్క కింద ఖననం చేసినట్లు ఆమె కన్నీటిపర్యంతమవుతూ గుర్తుచేసుకున్నారు.
ఆ తీరని శోకం నుంచి మెల్లగా కోలుకున్న సోనియా గాంధీ, ఆ తర్వాత 1970 జూన్ 19న తన పెద్ద కుమారుడు రాహుల్ గాంధీకి జన్మనిచ్చారు.

Leave a Reply