“దొంగతనం చేసిందనే అనుమానం.. మహిళకు ఇలాంటి శిక్షా?” తాడుతో కట్టేసి ఛాతీ, మర్మాంగాలపై కాలితో తన్నిన గుంపు! వెలుగుచూసిన వీడియోతో తీవ్ర కలకలం.!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో దొంగతనం చేసిందనే అనుమానంతో ఒక మహిళను తాడుతో కట్టేసి ఓ గుంపు విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఈ ఘటన ఇందిరా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుగామౌ ప్రాంతంలో ఉన్న ఒక మురికివాడలో చోటుచేసుకున్నట్లు సమాచారం. మానసిక స్థితి సరిగా లేని ఆ మహిళ దొంగతనం చేసిందనే అనుమానంతో స్థానికులు కొందరు ఆమెను తాడుతో కట్టేసి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

ఆ మహిళను తాడుతో కట్టేసి ఛాతీ, మర్మాంగాలపై కాలితో తన్నుతూ, చేతులతో కొడుతూ చిత్రహింసలకు గురిచేసినట్లు చెబుతున్నారు. ఈ దాడి సమయంలో ఆ మహిళ నొప్పితో విలవిలలాడుతూ, తనను కాపాడాలని ఆర్తనాదాలు చేసినట్లు సమాచారం. దొంగతనం చేసిందనే అనుమానం ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉండగా, కొందరు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని మహిళపై ఈ దారుణానికి ఒడిగట్టారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు, దాడిలో పాల్గొన్నట్లు అనుమానిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ADCP) అమోల్ ముర్కుట్ ధ్రువీకరించారు. అంతేకాకుండా, ఘటన సమయంలో ఆ మహిళ చుట్టూ 40 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. ఈ దాడిలో ప్రమేయం ఉన్న మిగతా వారిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరోవైపు, ఇది స్వల్ప ఘర్షణ అని, అవతలి వర్గానికి చెందిన ఒకరికి కూడా గాయాలయ్యాయని ఇందిరా నగర్ సీఐ అజయ్ నారాయణ్ సింగ్ తెలిపారు. ఏది ఏమైనా.. దొంగతనం అనుమానం వస్తే సరైన పద్ధతిలో పోలీసులకు అప్పగించకుండా, ఒక మహిళను కట్టేసి దాడి చేసిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర దిగ్భ్రాంతిని, ఆగ్రహాన్ని రేకెత్తించింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *