తండ్రి ద్వారా సంక్రమించిన తాత ఆస్తిలో వాటా అడిగే హక్కు మనవడికి లేదని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
వారసత్వం లేదా కుటుంబ ఆస్తి పంపకాల ద్వారా తండ్రికి వచ్చిన ఆస్తిని, ఆయన సొంత (వ్యక్తిగత) ఆస్తిగానే పరిగణించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.
కాబట్టి, తండ్రి జీవించి ఉన్నంత కాలం కొడుకు తన జన్మహక్కును సాకుగా చూపుతూ ఆ ఆస్తిలో తనకు వాటా కావాలని చట్టబద్ధంగా కోరలేడు.
తనకు సంక్రమించిన ఆ ఆస్తిని అమ్ముకోవడానికి లేదా మరొకరికి దానంగా ఇవ్వడానికి తండ్రికి మాత్రమే పూర్తి హక్కు, అధికారం ఉంటాయని కోర్టు పేర్కొంది.
కుటుంబ ఆస్తి వివాదాలు, వారసత్వ హక్కులకు సంబంధించిన పలు కేసులకు పరిష్కారం చూపే దిశగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ సంచలన తీర్పు ఎంతో కీలకంగా మారింది.

Leave a Reply