ద్విచక్ర వాహనాలు, కార్లు ఇలా అన్ని వర్గాల ప్రజల దైనందిన జీవితంలో పెట్రోల్ బంకులు ఒక అనివార్యమైన ప్రదేశంగా మారాయి.
అయితే, మనం కొంటున్న ధరకు సరైన మోతాదులోనే పెట్రోల్ పోస్తున్నారా లేదా ఏదైనా మోసం జరుగుతోందా అనే అనుమానం చాలా మంది మదిలో ఎప్పటినుంచో ఉంది. “బంక్‌లో నాకు పెట్రోల్ తక్కువ పోశారు” అనే ఆరోపణలను మనం తరచూ వింటూనే ఉంటాం.
ఈ నేపథ్యంలో, ఓ పెట్రోల్ బంక్ ఉద్యోగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారి తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ‘జేబీ పెట్రో ఫ్యూయెల్స్’ (JB Petro Fuels) బంక్‌లో పనిచేస్తున్న గుడ్డు కశ్యప్ అనే ఉద్యోగి, పెట్రోల్ బంకుల్లో వినియోగదారులకు పెట్రోల్ మోతాదును ఎలా తగ్గించి పోస్తారో వివరిస్తూ తన వీడియోలో పలు షాకింగ్ విషయాలను పంచుకున్నాడు.
ఆ వీడియోలో అతను మాట్లాడుతూ.. “పెట్రోల్ బంకుల్లో మోతాదు తగ్గించి ఎలా మోసం చేస్తారని చాలా మంది నన్ను అడుగుతూనే ఉన్నారు. మొదట్లో ఈ రహస్యాన్ని చెప్పడం నాకు ఇష్టం లేకపోయినప్పటికీ, ఇప్పుడు బహిరంగంగానే చెబుతున్నాను” అని అన్నాడు.
అతను వివరించిన మోసపూరిత ట్రిక్ ప్రకారం.. ఒక కస్టమర్ రూ.100, 200 లేదా 500 కు ఎంత పెట్రోల్ అడిగితే, ఉద్యోగి ఆ మొత్తాన్ని యంత్రంలో నమోదు చేస్తాడు. ఆ తర్వాత, పెట్రోల్ పోసే నాజిల్‌ను (పైపును) మళ్లీ యంత్రంపై ఉంచే సమయంలో కొన్ని సాంకేతిక పరమైన జిమ్మిక్కులు చేసి, కస్టమర్‌కు చేరాల్సిన పెట్రోల్ మోతాదును తగ్గించి మోసం చేస్తారని ఆ ఉద్యోగి బహిరంగంగా ఆరోపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

Leave a Reply