లావెండర్ రంగు చీరలో ఒకే ఒక్క న్యూస్ రీడింగ్.. ఇంటర్నెట్‌ను తనవైపు తిప్పుకునేలా చేసిన మహిళా న్యూస్ యాంకర్.! అసలెవరీ బిస్లా దీక్ష.? వైరల్ అవుతున్న వీడియో.!!

లావెండర్ రంగు చీర, ప్రశాంతమైన రూపం, స్పష్టమైన వార్తల పఠనంతో న్యూస్ యాంకర్ బిస్లా దీక్ష తన ఆన్-స్క్రీన్ ప్రెజెన్స్‌తో నెటిజన్ల దృష్టిని విశేషంగా ఆకర్షించారు.

‘వియాన్’ (WION) న్యూస్ ఛానల్‌లో పనిచేస్తున్న ఆమె, వార్తలు చదువుతున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో చాలా మంది ఆమె గురించి నెట్టింట తెగ వెతుకుతున్నారు. ముఖ్యంగా, ఆమె సింపుల్ లుక్, హుందాతనంతో కూడిన ప్రవర్తన నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి.

బిస్లా దీక్ష ఢిల్లీలోని మిరాండా హౌస్ కళాశాలలో ఇంగ్లీష్ లిటరేచర్‌లో (ఆంగ్ల సాహిత్యం) బ్యాచిలర్ డిగ్రీ పొందారు. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో సాహిత్యంలోనే మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. హింస, జ్ఞాపకాలకు సంబంధించిన పరిశోధనల్లో కూడా ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. ఆమె సాహిత్య నేపథ్యం.. ఆమె జర్నలిజం వృత్తికి, వివిధ రంగాలపై ఉన్న ఆసక్తికి బలమైన పునాదిగా నిలిచింది.

వార్తలు చదవడమే కాకుండా కళలు, సంస్కృతి, సాహిత్యం, స్టోరీ టెల్లింగ్ (కథలు చెప్పడం) వంటి రంగాల్లోనూ బిస్లాకు ఆసక్తి ఉంది. గతంలో ఆమె ‘టీమ్‌వర్క్ ఆర్ట్స్’ (Teamwork Arts), ‘మైనస్ ఈక్వల్స్ ప్లస్’ (Minus Equals Plus), ‘స్కాలస్టిక్’ (Scholastic) తదితర సంస్థలతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. అంతేకాకుండా, పలు సాహిత్య ఉత్సవాలు, కళా సంబంధిత కార్యక్రమాల్లోనూ ఆమె చురుగ్గా పాల్గొంటుంటారు.

ప్రస్తుతం ఆమె లావెండర్ రంగు చీరలో వార్తలు చదువుతున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. దీంతో అసలు ఆమె ఎవరు, ఆమె విద్యా నేపథ్యం ఏంటి, గతంలో ఎక్కడెక్కడ పనిచేశారు అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. కేవలం కొన్ని సెకన్ల నిడివి ఉన్న వీడియోతో ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించిన బిస్లా దీక్ష, ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *