అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లలో భారత జట్టు తరఫున ఆడి అత్యధిక సార్లు పరుగులేమీ చేయకుండా ‘డకౌట్’ అయిన ఆటగాళ్ల జాబితా ప్రస్తుతం వెలుగులోకి వచ్చి అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీసింది.
ఈ జాబితాలో మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ 43 సార్లు డకౌట్ అయి మొదటి స్థానంలో ఉండగా, భారత జట్టు స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ 42 సార్లు డకౌట్ అయి రెండో స్థానంలో నిలిచారు.
సాధారణంగా బౌలర్లు అత్యధిక సార్లు డకౌట్ కావడం సహజమే అయినప్పటికీ, ప్రపంచ స్థాయి బ్యాట్స్మన్ అయిన విరాట్ కోహ్లీ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉండటం క్రికెట్ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆయన తర్వాత, ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ 40 సార్లు పరుగులేమీ చేయకుండానే అవుట్ అయి మూడో స్థానంలో ఉన్నారు.
అలాగే, ఈ జాబితాలో మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మరియు ప్రస్తుత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇద్దరూ చెరో 37 సార్లు డకౌట్ అయి నాలుగు, ఐదు స్థానాలను పంచుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో హిమాలయమంత రికార్డులను సృష్టిస్తున్న విరాట్ కోహ్లీ, ఈ అవాంఛిత రికార్డుల జాబితాలో జహీర్ ఖాన్ స్థానానికి చేరువ కావడం అభిమానులను కాస్త నిరాశకు గురిచేసింది.

Leave a Reply