పెన్షనర్లు తక్షణమే గమనించాలి.! నవంబర్ 30 లోపు ఈ ఒక్క సర్టిఫికెట్ సమర్పించకపోతే డిసెంబర్ నెల పెన్షన్ ఆగిపోవచ్చు.. బ్యాంకుకు వెళ్లకుండానే మొబైల్ ఫోన్‌లోనే పూర్తి చేయొచ్చు.! ఎలాగో తెలుసా.?

ప్రభుత్వ మరియు ఇతర అర్హులైన పెన్షనర్లు ప్రతి ఏటా తాము జీవించి ఉన్నట్లు ధృవీకరించే లైఫ్ సర్టిఫికెట్ (జీవన ప్రమాణ పత్రం) సమర్పించాల్సి ఉంటుంది.

ఇందుకోసం ‘జీవన్ ప్రమాణ్’ (Jeevan Pramaan) అని పిలిచే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సదుపాయం అందుబాటులో ఉంది. 2026వ సంవత్సరానికి సంబంధించిన సర్టిఫికెట్ సమర్పించడానికి నవంబర్ 30వ తేదీయే చివరి గడువు. నిర్ణీత గడువులోగా సర్టిఫికెట్ సమర్పించకపోతే, పెన్షన్ సొమ్ము జమ కావడంలో జాప్యం లేదా తాత్కాలికంగా నిలిచిపోయే అవకాశం ఉంది.

ఈ సర్టిఫికెట్ పొందడానికి ఇకపై బ్యాంకులకు గానీ, పెన్షన్ కార్యాలయాలకు గానీ నేరుగా వెళ్లాల్సిన అవసరం లేదు. అర్హులైన పెన్షనర్లు కేంద్ర ప్రభుత్వ ‘ఉమంగ్’ (UMANG) యాప్ ద్వారా ఇంటి నుంచే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ పొందవచ్చు. ఇందుకోసం ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుంచి ఉమంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, మొబైల్ నంబర్ సాయంతో లాగిన్ కావాలి. ఆ తర్వాత యాప్‌లో ‘జీవన్ ప్రమాణ్’ (Jeevan Pramaan) లేదా ‘లైఫ్ సర్టిఫికెట్’ (Life Certificate) అని సెర్చ్ చేసి ఆ సేవను ఎంచుకోవాలి.

అనంతరం ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (PPO) నంబర్, పెన్షన్ మంజూరు చేసే సంస్థ మరియు బ్యాంకు సంబంధిత వివరాలను నమోదు చేయాలి. ఆ తర్వాత ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు (ఫేస్ అథెంటికేషన్) లేదా గుర్తింపు పొందిన వేలిముద్ర సహా బయోమెట్రిక్ ధృవీకరణను పూర్తి చేయాలి. ముఖ గుర్తింపు ప్రక్రియకు అవసరమైన యాప్ ఫీచర్లు, అనుమతులను వినియోగించుకోవాలి. ధృవీకరణ విజయవంతంగా పూర్తయిన వెంటనే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ జనరేట్ అవుతుంది. దానితో పాటు వచ్చే ప్రత్యేక ‘ప్రమాణ్ ఐడీ’ (Pramaan ID) నంబర్‌ను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి.

యాప్ ద్వారా సర్టిఫికెట్ పొందలేని వారు సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC), బ్యాంకు లేదా పెన్షన్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ద్వారా ఇంటి వద్దకే వచ్చి సర్టిఫికెట్ జారీ చేసే సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వృద్ధ పెన్షనర్లు చివరి రోజు వరకు వేచి చూడకుండా నవంబర్ 30 లోపే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవడం ఉత్తమం. మీ ఇంట్లో పెన్షన్ పొందుతున్న పెద్దలు ఉంటే, వారికి కూడా ఈ సమాచారాన్ని అందించి సహాయపడండి.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *