ఒడిశా రాష్ట్రం సంబల్పూర్ (Sambalpur) జిల్లాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఒక కుక్క మాంసాన్ని మతిస్థిమితం లేని ఒక వ్యక్తి తిన్న ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.
సంబల్పూర్ ప్రాంతంలోని మానేశ్వర్ చౌక్ (Maneswar Chowk) సమీపంలో వాహనం ఢీకొని చనిపోయిన ఒక కుక్క రోడ్డు పక్కన పడి ఉంది. ఆ దారి గుండా వెళ్తున్న ప్రజలు, అక్కడ ఒక వ్యక్తి కూర్చుని ఆ కుక్క మాంసాన్ని పీక్కుతింటుండటం చూసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
ఆ వ్యక్తి వేషధారణ, వింత ప్రవర్తనను గమనిస్తే.. అతను మతిస్థిమితం కోల్పోయి, తీవ్రమైన ఆకలి, పేదరికంతో అలమటిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
అక్కడ గుమిగూడిన వారు అతన్ని ఆపడానికి ప్రయత్నించినప్పటికీ, అతను అవేమీ పట్టించుకోకుండా దాన్ని అలాగే తింటూనే ఉన్నాడని చెబుతున్నారు. ఈ ఘటన అక్కడి వారిని తీవ్ర ఆవేదనకు గురిచేసింది.
ఇలాంటి దయనీయ స్థితిలో రోడ్లపై నివసించే వారి ఆకలి బాధలు, మానసిక ఆరోగ్య సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని, వెంటనే ఆ వ్యక్తిని గుర్తించి అతనికి ఆహారం, వైద్య సహాయం అందించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply